తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్వారంటైన్ పాటించని ఆటగాళ్లు.. సాయ్ మండిపాటు!

పటియాలాలోని నేతాజీ సుభాష్​ జాతీయ క్రీడా కేంద్రంలో కొందరు అథ్లెట్లు క్వారంటైన్​ నిబంధనలు అతిక్రమించినట్లు తమకు ఫిర్యాదు అందిందని తెలిపింది సాయ్​. తప్పు చేసినట్లు రుజువైతే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

క్వారంటైన్ నిబంధనలు అతిక్రమించిన ఆటగాళ్లు.. రంగంలోకి సాయ్!
SAI to take action against erring players, officials for 'flouting rules'

By

Published : Jul 11, 2020, 6:00 PM IST

అసలే కరోనా కాలం.. ఎటువైపు నుంచి ఎలా వచ్చి అంటుకుంటుందో ఆ మహమ్మారికే తెలియాలి. ఇలాంటి సమయంలో కొందరు ఆటగాళ్లు ఏడు రోజుల క్వారంటైన్​ నిబంధనలు పాటించలేదని.. ఈ మేరకు తమకు ఫిర్యాదు అందినట్లు వెల్లడించింది క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్​). ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు.. అథ్లెట్లు తప్పుచేసినట్లు తేలితే క్షమశిక్షణ చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని గట్టిగా హెచ్చరించారు.

ఆటగాళ్ల శిక్షణా కేంద్రం

ఇదీ జరిగింది..?

లాక్​డౌన్ అన్​లాక్ ప్రక్రియలో భాగంగా ఇటీవలే క్రీడా కేంద్రాలు తెరిచేందుకు అనుమతులిచ్చింది ప్రభుత్వం. అప్పట్నుంచి పటియాలాలోని నేతాజీ సుభాష్​ జాతీయ క్రీడా కేంద్రంలోనూ అథ్లెట్లు శిక్షణకు హాజరవుతున్నారు. వారి కోసం అధికారులు కొన్ని నిబంధనలు పెట్టారు. ఎవరైనా శిక్షణ తరగతులకు హాజరయ్యే ముందు.. ఏడు రోజులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్​లో ఉండాలి. ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం మిగతా ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్​ చేసుకోవచ్చు. అయితే కొంతమంది బాక్సర్లు ఈ నిబంధనలు ఉల్లంఘించారని మండిపడింది సాయ్​.

"ఘటనపై విచారణకు ఆదేశించాం. ఆటగాళ్లు, అధికారులు ఎవరైనా తప్పుచేసినట్లు తేలితే వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏడు రోజులు క్వారంటైన్ నిబంధనలు​ పాటించకుండా కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికే క్వారంటైన్ పొందిన ఆటగాళ్లతో కలిసినట్లు మాకు ఫిర్యాదు అందింది" అని సాయ్​ తెలిపింది.

ఒలింపిక్స్​ కోసం సన్నాహాల్లో ఉన్న ఆటగాళ్ల కోసం జులై 8 నుంచే కర్ణి సింగ్​ షూటింగ్​ రేంజ్​ను కూడా ఓపెన్​ చేశారు. ఇందులో తొలుత భారత షూటింగ్​ జట్టులోని కీలక ప్లేయర్లకు అవకాశమిచ్చారు. సామాజిక దూరం పాటించడమే కాకుండా ప్రతి ఆటగాడికి థర్మల్​ స్క్రీనింగ్​, ఆరోగ్య సేతు యాప్​ వాడకాన్ని పక్కా చేశారు.

ABOUT THE AUTHOR

...view details