భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ టైటిల్ గెల్చుకుంది. 21-9, 11-21, 21-15 తేడాతో చైనాకు చెందిన వాగ్ యీని ఓడించింది. దీంతో ఈ సీజన్లో తొలి సూపర్ 500 టైటిల్‌ను దక్కించుకుంది డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సింధు. ఆసియా ఛాంపియన్షిప్స్ గోల్డ్ మెడలిస్ట్, 22 ఏళ్ల వాంగ్.. సింధు ముందు తేలిపోయింది. తొలి సెట్‌ను అలవోకగా నెగ్గిన భారత షట్లర్.. రెండో సెట్‌ను 11-21తో కోల్పోయింది. మూడో సెట్‌ను మళ్లీ 21-15తో గెల్చుకొని.. ట్రోఫీని కైవసం చేసుకుంది.
సింగపూర్ ఓపెన్ విజేతగా సింధు.. ప్రధాని మోదీ అభినందనలు
11:42 July 17
సింగపూర్ ఓపెన్ విజేతగా సింధు
సింగపూర్ ఓపెన్‌లో సింధు విజేతగా నిలవడంపై ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. "తొలి సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న పీవీ సింధుకు నా అభినందనలు. మరోసారి తన అద్భుతమైన క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి విజయం సాధించింది. ఇది దేశం గర్వించే క్షణం. ఈ విజయం ఎంతో మంది భవిష్యత్తు ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తుంది." అని ట్వీట్ చేశారు.
జులై 28 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు ఈ విజయం సింధుకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.
ఈ సీజన్లో సింధుకు మొత్తంగా ఇది మూడో టైటిల్. ఇప్పటికే 2022లో రెండు సూపర్ 300 టైటిళ్లు గెల్చుకుంది సింధు. ఇందులో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు సింగపూర్ ఓపెన్ విజేతగా నిలిచింది.
ఇదీ చూడండి :ప్రాక్టీస్‌కు వెళ్లలేకపోతున్నా.. భారత్ మాకు చాలా సాయం చేసింది: లంక క్రికెటర్ భావోద్వేగం