ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 25 తేదీల మధ్య చైనాలోని హాంగ్‌జావ్ నగరంలో జరగాల్సిన 2022 ఆసియా గేమ్స్‌ను ఇటీవలే వాయిదా వేశారు. అయితే తాజాగా రీషెడ్యూల్ తేదీలను ప్రకటించింది ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా. 2023 సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించబోతున్నట్లు తెలిపింది.
ఆసియా గేమ్స్ రీషెడ్యూల్ తేదీలు ఖరారు - ఆసియా గేమ్స్ వేదిక
వాయిదా పడిన 2022 ఆసియా గేమ్స్ రీషెడ్యూల్ తేదీలను ప్రకటించింది ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా. 2023 సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించబోతున్నట్లు తెలిపింది.
ఆసియాగేమ్స్ రీషెడ్యూల్
కాగా, ఈ ఆసియా గేమ్స్ ఎందుకు వాయిదా వేశారో స్పష్టతమైన కారణాలు తెలియదు. అయితే ఈ గేమ్స్ నిర్వహించాల్సిన హాంగ్‌జావ్ ప్రాంతం అక్కడి ప్రధాన నగరమైన షాంఘైకు సమీపంలో ఉంటుంది. ప్రస్తుతం అక్కడ కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో లాక్‌డౌన్ అమలుచేస్తున్నట్లు తెలిసింది. అందుకే ఈ క్రీడలను వాయిదా వేసినట్లు సమాచారం.
ఇదీ చూడండి: బెన్‌స్టోక్స్.. టాప్ 5 వన్డే ఇన్నింగ్స్ ఇవే