టోక్యో పారాలింపిక్స్‌లో(paralympics 2021) మన అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 19 పతకాలు గెలుచుకున్నారు. దీంతో మన క్రీడాకారులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దిల్లీలో వారికి జరిగిన సన్మాన కార్యక్రమంలో కేంద్ర క్రీడామంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"వాళ్ల విజయం చరిత్రలో నిలిచిపోయింది. గతసారి 19మంది అథ్లెట్లు పోటీలకు వెళ్తే.. ఈసారి 19 పతకాలు తీసుకొచ్చారు. ఈ విషయమై మనందరం వారికి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి" అని అన్నారు.