ఈ ఏడాది మొత్తంలో మంచి ప్రదర్శన చేసిన ముగ్గురు ఆటగాళ్లకు ఆయా దేశాల జట్లకు ప్రాతినిథ్యం వహించే అవకాశం లభిస్తుంది. 2020 ఆగస్టు నెలలో మండుతున్న జ్యోతిని టోక్యోలో ఉంచుతారు. ఈ పారాలింపిక్ రిలేను 'షేర్ యువర్ లైట్'గా పిలుస్తున్నారు. ప్రతి ఒక్కరు పారాగేమ్స్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ దీన్ని తయారు చేసారు.
టార్చ్, లోగో విడుదల చేసిన నిర్వాహాకులు టార్చ్ రిలే లోగో..
ఈ రిలే టార్చ్ లోగోలో మూడు చతురస్రాకార బొమ్మలు ఉంటాయి. ఇది మంటకు సూచనగా రూపొందించారు నిర్వాహకులు. దీనికి ఉడ్ బ్లాక్ ప్రింటింగ్ టెక్నిక్‌ను ఉపయోగించారు. ఇది ఒకేసారి రెండు వేర్వేరు రంగులను చూపిస్తుంది. ఇది దీని ప్రత్యేకత.
- బంగారు, పసుపు వర్ణాల మిశ్రమంలో ఈ లోగోను రూపొందించారు. బంగారు రంగు విభిన్న వ్యక్తిత్వానికి సూచనగా...పసుపు వర్ణం పండుగ లాంటి భావనను కలిగిస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. అడుగున ఉన్న మట్టి రంగు భూమికి సంకేతంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ టార్చ్‌ను విభిన్న ప్రాంతాల్లో తిప్పుతారు.
.
- ఒలింపిక్ జ్యోతి ఎందుకు వెలిగిస్తారు..??
ఒలింపిక్ జ్యోతి శాంతి, ఆశకు గుర్తు. దీన్ని ఒలిపింక్స్ నిర్వహించే దేశంలో తిప్పుతారు. అయితే 2020 ఒలింపింక్ జ్యోతి ఆశకు, మార్గనిర్దేశానికే కాకుండా ఆనందం , తపనకు గుర్తుగా భావిస్తారు.
- ఒలిపింక్స్ టార్చ్ రిలే...
ఒలింపిక్ రిలే తొలుత గ్రీస్‌లోని ఒలింపియా నుంచి ప్రారంభమవుతుంది. గ్రీస్ మొత్తం తిప్పిన తర్వాత జ్యోతిని ఆతిథ్య దేశానికి తీసుకొస్తారు. ఒలింపిక్స్ ప్రారంభవేడుక ముందు వరకు దాన్ని ఆతిథ్య దేశంలోనే తిప్పుతారు. ఒలింపిక్ జ్యోతిని ఒలింపిక్స్‌కు గుర్తుగా ఉపయోగిస్తారు. దీన్ని శాంతి స్థాపన, స్నేహం, ఏకతా భావనకు గుర్తుగా భావిస్తారు. 1928 ఆమెస్టర్డామ్ నుంచి జ్యోతి ఉపయోగించడం ప్రారంభించారు.
ఒలింపిక్ జ్యోతిని ఒలింపిక్స్ ప్రారంభానికి కొన్ని నెలల ముందే వెలిగించి పాత ఒలింపియా ప్రాంతంలోని హెరా గుడిలో పూజ చేసి వెలుగుతున్న జ్యోతిని అక్కడే ఉంచుతారు. వందల మంది ఆ జ్యోతిని కొంత దూరం తీసుకొచ్చి ప్రారంభ వేడుకరోజు ఆతిథ్య ప్రాంతానికి తీసుకొస్తారు. ఈ వెలుగుతున్న జ్యోతిని స్టేడియంలో ఉంచుతారు. ఇది ఆటలు ముగిసేవరకు వెలుగుతూనే ఉంటుంది.
ఒలింపిక్స్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..??
- వెలిగించని ఒలింపిక్ జ్యోతిని చాలా సార్లు అంతరిక్షంలోకి తీసుకెళ్లారు.
- ఒలింపిక్ గుర్తులో ఐదు రింగులు ఉంటాయి. నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు రంగులు ఉంటాయి. దీనికి కారణం ఇందులోని ఏదొక రంగు ప్రతి దేశం జెండాలోను ఉంటుంది.
- ఐదు రింగులు ఐదు ఖండాలకు గుర్తుగా బారన్ ఫియర్రే తయారు చేశారు.
- ఇప్పటికి ఒలింపిక్స్‌ను 23 దేశాల్లో నిర్వహించారు.
- తొలి ఒలింపిక్ మస్కట్ పేరు 'వల్ది'. ఇది ఒక దచ్స్కండ్ (ఒక జాతి కుక్క). 1972 జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో దీనిని ఉపయోగించారు.
- 2016లో(రియో ఒలింపిక్స్)దక్షిణ అమెరికాలో తొలిసారి నిర్వహించారు .
- ఒలింపిక్స్‌లో భాగస్వామ్యం పొందని క్రీడలు.. సోలో సింక్రొనైజ్డ్ స్విమ్మింగ్, టగ్ ఆఫ్ వార్, రోప్ క్లైంబింగ్, హాట్ ఎయిర్ బెలూనింగ్, డ్యుయలింగ్ పిస్తోల్, టాండెమ్ బైస్కిల్, స్విమ్మింగ్ అబ్స్టాకిల్ రేస్.
- 2012లో అన్ని దేశాల మహిళా క్రీడాకారులను ఒలింపిక్స్‌కి పంపించారు.
- 2004 ఏథేన్స్ సమ్మర్ ఒలింపిక్స్‌లో 202 దేశాలు పాల్గొన్నాయి.
- 1936 ఒలింపిక్స్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇద్దరు జపాన్ పోల్ వాల్టర్స్ రెండో స్థానంలో నిలిచారు. మళ్లీ పోటీ నిర్వహించాలని అధికారులు భావించినా.. వారు అందుకు ఒప్పుకోలేదు. రజతం, కాంస్య పతకాల్ని రెండింటినీ సగానికి కట్ చేసి పంచుకున్నారు.
- 1912-1948 వరకు ఒలింపిక్స్ లో కళాకారులు కూడా పాల్గొనేవారు. చిత్రకారులు, శిల్పులు, ఆర్టిటెక్ట్స్, రచయతలు, సంగీత కళాకారులు వారి వారి విభాగాల్లో పోటీ పడేవారు.
- టార్జాన్ సినిమాలో నటించిన వీస్ ముల్లర్ ఒలింపిక్స్ లో 1920లో స్మిమ్మింగ్ విభాగంలో ఐదు బంగారు పతకాలను గెలుచుకున్నాడు.
- ప్రతి సంవత్సరం ఆతిథ్యం ఇచ్చే దేశ భాష కాకుండా ఒలింపిక్స్ అధికారిక భాషలు ఇంగ్లీష్, ఫ్రెంచ్.
- ఇప్పటికీ నలుగురు క్రీడాకారులు మాత్రమే వింటర్, సమ్మర్ ఒలింపిక్స్ రెండింటిలోనూ పతకాలను కైవసం చేసుకున్నారు.
- 1924 నుంచి 1992 వరకు వింటర్, సమ్మర్ ఒలింపిక్స్‌ను ఒకే ఏడాదిలో నిర్వహించేవారు. ప్రస్తుతం రెండు సంవత్సరాల తేడాతో నిర్వహిస్తున్నారు.
- 1900 నుంచి ఒలింపిక్స్ లో మహిళలకు తొలిసారి ప్రవేశం లభించింది.
- పూర్వ గ్రీస్ ఒలింపిక్స్‌లో స్పాన్సర్ షిప్, రక్షణ, ఫ్యాషన్ గురించి క్రీడాకారులు ఆలోచించేవారు కాదు. నగ్నంగా పోటీల్లో పాల్గొనేవారు.
- 8వ శతాబ్దంలో మొదటిసారి గ్రీస్ లోని ఒలింపియాలో పోటీలు జరిగాయి.