Para Asian Games 2023 India Medal Tally :ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వెల్లువ కొనసాగుతోంది. మొదటి రోజు, సోమవారం 6 గోల్డ్‌మెడల్స్‌తో పాటు 17 పతకాలు.. రెండో రోజు మంగళవారం 3 స్వర్ణాలు సహా 17 పతకాలు ఖాతాలోకి వచ్చాయి. మెడల్స్ టేబుల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది.
షాట్‌పుట్‌లో రవి.. షాట్‌పుట్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ రవి రొంగలి సిల్వర్‌మెడల్‌ను ముద్దాడాడు. ఎఫ్-40 విభాగంలో అతడు గుండును 9.92 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. రాంపాల్ (హైజంప్), అజయ్‌కుమార్ (400 మీ), ప్రమోద్ (1500 మీ), రుద్రాంశ్ ఖండేవాల్ (10 మీటర్ల పిస్టల్), సిమ్రన్‌శర్మ (మహిళల 100 మీ), ధరమ్‌వీర్ (క్లబ్‌త్రో), యోగేశ్ (డిస్కస్‌త్రో), కపిల్ పర్మర్ (జూడో, 60 కేజీ) సిల్వర్ మెడల్స్ దక్కించుకున్నారు.
భార్య - భర్త ఇద్దరూ.. కనోయింగ్‌లో ప్రాచి యాదవ్.. రెండు విభాగాల్లో గోల్డ్ మెడల్‌తో పాటు సిల్వర్ మెడల్‌ను కూడా దక్కించుకుంది. కేఎల్-2 విభాగంలో 54.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణాన్ని అందుకున్న ఆమె.. వీఎల్-2లో 1 నిమిషం 13.14 సెకన్లలో రేసు కంప్లీట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇక పురుషుల కేఎల్-3లో ప్రాచి భర్త మనీశ్ కౌరవ్ బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నాడు. అతడు 44.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచాడు.
పసిడి పట్టేసిన అవని.. టోక్యో పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అవని లేఖరా.. ఆసియా పారా క్రీడల్లోనూ స్వర్ణ పతకాన్ని అందుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌లో ఆమె 249.6 పాయింట్లతో గోల్డ్ మెడల్‌ను దక్కించుకుంది. హైజంప్ టీ63 కేటగిరిలో మూడు మెడల్స్ భారత్ ఖాతాలోనే పడ్డాయి. శైలేశ్‌కుమార్ (1.82 మీటర్లు) స్వర్ణాన్ని ముద్దాడగా.. తంగవేలు (1.80 మీ) సిల్వర్ మెడల్, రామ్‌సింగ్ (1.79 మీ) బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నారు. నిషధ్ కుమార్ (హైజంప్ టీ47), శైలేశ్‌కుమార్ (హైజంప్, టీ63), అంకుర్ దామా (5 వేల మీ), ప్రవీణ్‌కుమార్ (హైజంప్, టీ64), ప్రణవ్ సూర్మా (క్లబ్‌త్రో), శంకరప్ప శరత్ (5000 మీటర్లు), నీరజ్ యాదవ్ (డిస్కస్‌త్రో) గోల్డ్ మెడల్స్‌ను దక్కించుకున్నారు.