తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెజ్లింగ్​లో పతకాల పంట.. మరో నలుగురికి గోల్డ్​ - Indian wrestler Vinesh Phogat WINS GOLD

Olympic Silver medallist Ravi Kumar Dahiya wins gold at commonwealth games 2022
Olympic Silver medallist Ravi Kumar Dahiya wins gold at commonwealth games 2022

By

Published : Aug 6, 2022, 10:09 PM IST

Updated : Aug 7, 2022, 3:49 AM IST

22:03 August 06

భారత్​కు పతకాల పంట

Ravi Kumar Dahiya: కామన్వెల్త్​ గేమ్స్​లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. రెజ్లింగ్​లో పతకాల పంట పండిస్తున్నారు కుస్తీ వీరులు. ఇప్పటికే ముగ్గురు భారత రెజ్లర్లు బజరంగ్​ పునియా, దీపక్​ పునియా, సాక్షి మాలిక్​ గోల్డ్​ మెడల్స్​ సాధించగా.. శనివారం భారత్​ను మరో నాలుగు స్వర్ణాలు వరించాయి. పురుషుల ఫ్రీస్టైల్​ 57 కేజీల విభాగంలో రవి దహియా, 74 కిలోల విభాగంలో నవీన్​ బంగారు పతకం సాధించారు. ఫైనల్లో నైజీరియాకు చెందిన వెల్సన్​పై రవి 10-0 తేడాతో టెక్నికల్​ సుపిరియారిటీ కింద విజేతగా నిలిచాడు. రవి దహియా 3 సార్లు ఆసియా ఛాంపియన్​గా నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్​లోనూ రజత పతకం సాధించాడు. ఆడిన తొలిసారే కామన్వెల్త్​ క్రీడల్లో బంగారం పట్టాడు రవి. మరోవైపు నవీన్​ పాకిస్థాన్​కు చెందిన మహమ్మద్​ తాహిర్​పై 9-0 తేడాతో ఘన విజయం సాధించాడు. 97 కిలోల విభాగంలోనూ భారత్​ను గోల్డ్​ వరించింది. పాకిస్థాన్​కు చెందిన తాయబ్​ రజాను దీపక్​ నెహ్రా చిత్తుగా ఓడించాడు.

మహిళల రెజ్లింగ్​లో కూడా భారత్​కు మరో స్వర్ణం దక్కింది. 53 కేజీల విభాగం ఫైనల్​లో వినేశ్​ ఫొగాట్​ గెలుపొందింది. శ్రీలంక రెజ్లర్​ను చిత్తుగా ఓడించి బంగారం పతకాన్ని ముద్దాడింది. మదురవలగే డాన్​పై విజయం సాధించింది. రెజ్లింగ్​లో భారత్​కు ఇది ఐదో స్వర్ణం కావడం విశేషం. ఫొగాట్​కు కామన్వెల్త్​ గేమ్స్​లో ఇది వరుసగా మూడో పసిడి పతకం. ఇలా కామన్వెల్త్​ గేమ్స్​లో వరుసగా మూడో గోల్డ్​లు సాధించిన తొలి భారత మహిళ కావడం విశేషం. అంతకుముందు ఆసియా క్రీడల్లోనూ వినేశ్​కు గోల్డ్​ ఉంది.
అంతకుముందు మహిళల 50 కేజీల విభాగంలో పూజా గహ్లోత్​ కాంస్యం నెగ్గింది. స్కాట్లాండ్​ రెజ్లర్​పై టెక్నికల్​ సుపీరియారిటీతో (12-2) గెలుపొందింది. పూజా అండర్​-23 వరల్డ్​ ఛాంపియన్​ షిప్స్​లో సిల్వర్​ మెడలిస్ట్​.

Last Updated : Aug 7, 2022, 3:49 AM IST

ABOUT THE AUTHOR

...view details