వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు ఇప్పటివరకు అర్హత సాధించకపోవడంపై స్పందించింది భారత స్ప్రింటర్ హిమదాస్. అందుకు తనకేమీ బాధగా లేదని తెలిపింది. ఈ విశ్వక్రీడలు జరగడానికి ఇంకా ఏడాది సమయం ఉందని.. ఈలోగా అర్హత సాధించడానికి తనవంతు కృషి చేస్తానని వెల్లడించింది. ప్రస్తుతం విజృంభిస్తోన్న మహమ్మారి త్వరగా అంతమైపోవాలని ప్రతిఒక్కరూ ప్రార్థించాలని సూచించింది.
ఈ సారి 200మీటర్లలో
ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం తెచ్చిన తొలి మహిళా అథ్లెట్‌గా పేరు సంపాదించింది హిమదాస్. 400మీటర్ల రేసులో బరిలో దిగి 50.79 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి రికార్డులకెక్కింది. అయితే ఆ తర్వాత వెన్ను గాయంతో కొంత కాలం విశ్రాంతి తీసుకుంది.
ఈ నేపథ్యంలో హిమదాస్ భవిష్యత్తులో 200మీటర్ల పరుగులోనూ పాల్గొననున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే దీనిపై స్పందించిన ఆమె.. తన కోచ్, భారత అథ్లెట్ సమాఖ్య (ఏఎఫ్ఐ) తీసుకునే నిర్ణయంపై ఈ విషయం ఆధారపడి ఉంటుందని తెలిపింది.
ఫిట్‌గానే ఉన్నా