కరోనా నేపథ్యంలో ఈ ఏడాది దేశంలోని ఏ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ కూడా విదేశాల్లో జరిగే అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనబోరని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా స్పష్టం చేశాడు. దీంతో ఆగస్టు 14న ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ మీట్లలో భారత ఆటగాళ్లు పాల్గొనరు. ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న జావెలిన్ త్రోయర్లు నీరజ్ చోప్రా, శివ్‌పాల్ పోటీలకు దూరం కానున్నారు.
'అంతర్జాతీయ టోర్నీల్లో భారత అథ్లెట్లు పాల్గొనరు' - ఆదిల్ సుమరివాలా
2021 కంటే ముందు భారత అథ్లెట్లను విదేశాలకు పంపలేమని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా స్పష్టం చేశాడు. వచ్చే ఏడాదిలో జరిగే టోర్నీలకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపాడు.
'అంతర్జాతీయ టోర్నీల్లో భారత అథ్లెట్లు పాల్గొనరు'
"2021కి ముందు మన అథ్లెట్లను విదేశాలకు పంపలేం. డైమండ్ లీగ్‌లో మన అథ్లెట్లు పాల్గొనరు. జాతీయ శిబిరాల్లోని అథ్లెట్లు మరో మూడు నెలల పాటు అక్కడే ఉంటారు. సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ఇండియన్ గ్రాండ్ ప్రి రేసుల్లో మన అథ్లెట్లు పోటీపడతారు. వచ్చే ఏడాది వాళ్లకు యూరోప్‌లో శిక్షణ ఇప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం" అని ఆదిల్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి..'పూర్తిస్థాయిలో మహిళల ఐపీఎల్ నిర్వహించాలి'