తెలంగాణ

telangana

ETV Bharat / sports

రింగ్​లో దిగకముందే నిరాశ.. ఆమిర్​తో మ్యాచ్​కు నీరజ్ దూరం

సౌదీలో జరిగే ప్రపంచ ప్రో బాక్సింగ్ ఛాంపియన్ షిప్ నుంచి భారత బాక్సర్ నీరజ్ వైదొలిగాడు. ప్రాక్టీస్ ముగించుకుని ఇంటికి వస్తుండగా నీరజ్ కారు ప్రమాదానికి గురయింది. ఫలితంగా జులై 12న పాక్ సంతతి బ్రిటీష్ బాక్సర్ ఆమిర్ ఖాన్​తో జరిగే పోరుకు దూరమయ్యాడు నీరజ్.

ఆమిర్ ఖాన్,

By

Published : Jun 26, 2019, 4:31 PM IST

భారత ప్రో బాక్సర్ నీరజ్​ గోయత్ కారు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. ప్రాక్టీస్ ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫలితంగా సౌదీలో జరిగే ప్రో బాక్సింగ్ ఛాంపియన్ షిప్ నుంచి నీరజ్ వైదొలిగాడు.

ప్రో బాక్సింగ్ ఛాంపియన్​ షిప్​లో భాగంగా నీరజ్ పాకిస్థాన్ సంతతి బ్రిటీష్ బాక్సర్ ఆమిర్ ఖాన్​తో తలపడాల్సి ఉంది. జులై 12న జరిగే ఈ మ్యాచ్​ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నీరజ్ వైదలిగిన కారణంగా మరో ప్రత్యామ్యాయ ఆటగాడి కోసం నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు.

ఆమిర్ ఖాన్, నీరజ్ గోయత్

ఈ పోరు కోసం ఆమిర్​, నీరజ్​ మధ్య ఇప్పటికే మాటల యుద్ధం జరుగుతోంది. ప్రపంచకప్​లో పాకిస్థాన్​పై భారత్​ గెలుపునకు ప్రతీకారం తీర్చుకుంటానని ఆమిర్ శపథం చేయగా.. ఈ మ్యాచ్​లో గెలిచి భారత్ సత్తా చూపిస్తానని నీరజ్ సవాల్ విసిరాడు.

ఇవీ చూడండి.. రింగ్​ వార్​: పాక్ బాక్సర్​కు నీరజ్​ సవాల్ ​

ABOUT THE AUTHOR

...view details