తెలంగాణ

telangana

ETV Bharat / sports

వినేశ్​కు మద్దతుగా నిలిచిన నీరజ్​ చోప్డా

సస్పెన్షన్​కు గురైన స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు మద్దతుగా నిలిచాడు టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్డా. క్రీడాకారులందరూ ఏ పోటీలో అయినా జాతీయ జెండాను రెపరెపలాడించాలనే బరిలో దిగుతారని.. వినేశ్​ అందుకు మినహాయింపు కాదని అన్నాడు.

neeraj chopra support to vinesh phogat
వినేశ్​కు మద్దతుగా నిలిచిన నీరజ్​ చోప్డా

By

Published : Aug 17, 2021, 10:56 AM IST

క్రమశిక్షణా రాహిత్యం కారణంగా సస్పెన్షన్‌ వేటుకు గురైన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్డా నుంచి మద్దతు లభించింది. ప్రతి క్రీడాకారుడు దేశ జెండాను ఎగరేయాలనే బరిలో దిగుతాడని.. వినేశ్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదని నీరజ్‌ అన్నాడు.

"ఈ క్లిష్ట సమయంలో వినేశ్‌కు నేను మద్దతిస్తున్నా. క్రీడాకారులందరూ ఏ పోటీలో అయినా జాతీయ జెండాను రెపరెపలాడించాలనే బరిలో దిగుతారు. ఎన్నోసార్లు వినేశ్‌ భారత్‌కు పతకాలు అందించింది. ఇందుకు ఆమెను చూసి అందరూ గర్విస్తున్నాం. ఆమెకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది."

- నీరజ్​ చోప్డా, జావెలిన్​ క్రీడాకారుడు

టోక్యో ఒలింపిక్స్‌లో అధికారిక జెర్సీ కాకుండా వ్యక్తిగత స్పాన్సర్‌ ఉన్న జెర్సీని ఉపయోగించడం, ఫిజియో విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడం సహా భారత రెజ్లర్లతో కలిసి ప్రాక్టీస్‌ చేయడానికి నిరాకరించడం వల్ల వినేశ్‌పై భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) సస్పెన్షన్‌ వేటు వేసింది. తన ప్రవర్తన పట్ల వినేశ్‌ డబ్ల్యూఎఫ్‌ఐకి క్షమాపణలు చెప్పినా.. ఆమెను పోటీలకు అనుమతించే విషయమై సమాఖ్య సానుకూలంగా కనిపించట్లేదు.

ఇదీ చదవండి :MS Dhoni: అభిమాని సాహసం.. ధోనీని కలిసేందుకు పాదయాత్ర

ABOUT THE AUTHOR

...view details