ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కార ప్రదానోత్సవంపై కరోనా ప్రభావం పడింది. ఫలితంగా తొలిసారి వర్చువల్ పద్దతిలో వేడుకను నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఆ సమయంలో విజేతలు వారి స్వస్థలాల నుంచే ఆన్లైన్ ద్వారా కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు తెలిపారు.
"2020 సంవత్సరం క్రీడా పురస్కార ప్రదాన కార్యక్రమం ఆన్లైన్లో జరిగే అవకాశం ఉంది. భారత ప్రభుత్వ సూచనల మేరకు అవార్డు పొందిన వారి పేర్లను వేడుక రోజు ప్రకటిస్తారు."