నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్... అర్జున, రాజీవ్ ఖేల్ రత్న, ద్రోణాచార్య సహా పలు అవార్డులను క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు అందజేయనున్నారు. క్రీడా రంగంలో కృషి చేసిన మాజీ ఆటగాళ్లు, కోచ్‌లకు 'ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం' ఇస్తారు. ఈ ఏడాది అవార్డుల కోసం జాబితాలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు వీరే.
ఖేల్ రత్న:
భజరంగ్ పూనియా(రెజ్లింగ్), దీపా మాలిక్(పారా అథ్లెట్).
అర్జున అవార్డు
తజిందర్ పాల్ సింగ్(అథ్లెటిక్స్), మహ్మద్ అనాస్ (అథ్లెటిక్స్), ఎస్ భాస్కరన్(బాడీ బిల్డింగ్), సోనియా లాథర్(బాక్సింగ్), రవీంద్ర జడేజా(క్రికెటర్), చింగ్లెన్సన కంగుజం(హాకీ), అజయ్ ఠాకుర్(కబడ్డీ), గౌరవ్ సింగ్ గిల్(మోటార్ స్పోర్ట్స్), ప్రమోద్ భగత్(పారా స్పోర్ట్స్-బ్యాడ్మింటన్), అంజుమ్ మోద్గిల్(షూటింగ్), హర్మీత్ రాజుల్ దేశాయ్(టేబుల్ టెన్నిస్), పూజా దండా(రెజ్లింగ్), ఫౌద్ మీర్జా(ఈక్వెస్ట్రియిన్), గుర్ప్రీత్ సింగ్ సంధు(ఫుట్‌బాల్), పూనమ్ యాదన్(క్రికెటర్) స్వప్న బర్మాన్(అథ్లెటిక్స్), సుందర్ సింగ్ గుర్జార్(పారా స్పోర్ట్స్-అథ్లెటిక్స్), భమిడిపాటి సాయి ప్రణీత్(బ్యాడ్మింటన్), సిమ్రాన్ సింగ్ షెర్గిల్(పోలో).
ద్రోణాచార్య అవార్డు(సాధారణ విభాగం):
విమల్ కుమార్(బ్యాడ్మింటన్), సందీప్ గుప్తా(టేబుల్ టెన్నిస్), మోహిందర్ సింగ్ దిల్లాన్(అథ్లెటిక్స్).
మెజ్బాన్ పాటిల్(హాకీ), రాంబీర్ సింగ్ (కబడ్డీ), సంజయ్ భరద్వాజ్(క్రికెటర్).