Nadal Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో రఫెల్ నాదల్ ఫైనల్‌కు చేరాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో మాటియో బెరెటినితో (ఇటలీ) హోరాహోరీగా సాగిన పోరులో 6-3,6-2,3-6,6-3 తేడాతో నాదల్ విజయం సాధించాడు. ఫైనల్లోనూ గెలిస్తే రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకున్న ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
మరోవైపు రెండో సెమీస్‌లో టాప్ సీడ్ డేనియల్ మెద్వెదెవ్ విజయం సాధించాడు. స్టెఫనోస్ సిట్సిపాస్‌ను 7-6, 4-6, 6-4, 6-1 తేడాతో ఓడించి ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు. ఆదివారం మెద్వెదెవ్, నాదల్ మధ్య ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.