భారత బాక్సింగ్ ఫెడరేషన్(బీఎఫ్ఐ)పై అసహనం వ్యక్తం చేస్తూ.. హైదరాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్ రాసిన లేఖకు కేంద్ర క్రీడామంత్రి కిరణ్‌రిజిజు స్పందించారు. ఈ అంశాన్ని ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్తానని ఆమెకు హామీ ఇచ్చారు. ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో క్రీడామంత్రి జోక్యమేమి ఉండదని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
"దేశం, క్రీడలు, అథ్లెట్ల పట్ల అత్యుత్తమ నిర్ణయం తీసుకునేలా బాక్సింగ్ ఫెడరేషన్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తా. అయితే క్రీడాకారుల ఎంపిక విషయంలో క్రీడామంత్రి ప్రమేయం ఉండదు. ఒలింపిక్ చార్టర్ ప్రకారం ఈ అంశం స్వతంత్ర ప్రతిపత్తిగల స్పోర్ట్స్ ఫెడరేషన్ చేతిలోనే ఉంటుంది" - కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడామంత్రి.