గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదానం చేసే పద్మ అవార్డుల కోసం ప్రముఖ క్రీడాకారులు నామినేట్ అయ్యారు. భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాలు పద్మ విభూషణ్కుమేరీకోమ్, పద్మ భూషణ్‌కు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పోటీ పడుతున్నారు.
విభూషన్కు తొలి మహిళా అథ్లెట్...
పద్మ విభూషణ్‌కు నామినేట్ అయిన మెుదటి భారత మహిళా అథ్లెట్‌గా నిలిచింది బాక్సర్మేరీకోమ్. ఇప్పటికే 2013లో పద్మ భూషణ్, 2006లో పద్మశ్రీ అందుకుంది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఈ క్రీడాకారిణి... పద్మ విభూషణ్ అందుకుంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్(2008), విశ్వనాథన్ ఆనంద్(2007), పర్వతారోహకురాలు ఎడ్మండ్ హిల్లరీ(2008) సరసన చోటు సంపాదించుకోనుంది.