ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్ మను బాకర్ సత్తాచాటింది. ఖతార్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో స్వర్ణం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 244.3 పాయింట్లతో పసిడి గెలుచుకుంది.
మరో భారత షూటర్ యశస్విని సింగ్ ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మేలో మునిచ్‌లో జరిగిన ప్రపంచకప్‌లోనే మను ఉత్తమ ప్రదర్శన కనబరిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. పురుషుల 10 మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్ దీపక్ కుమార్ కాంస్యాన్ని సాధించాడు. ఫైనల్ ఈవెంట్‌లో 227.8 స్కోరుతో పతకాన్ని కైవసం చేసుకుని అతడు టోక్యో ఒలింపిక్స్ బెర్తు ఖాయం చేసుకున్నాడు.