లార్డ్స్‌లో జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టులో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి టీమ్ఇండియా జెర్సీ వేసుకుని గ్రౌండ్లోకి వచ్చి హల్చల్ చేశాడు. అతని జెర్సీ వెనుక జార్వో అని రాసి ఉంది. ఆ వ్యక్తి గ్రౌండ్లోకి రావటం వల్ల ఆటకు కొంతసేపు అంతరాయం కలిగింది.
మైదానంలో అభిమాని.. రెండో టెస్టుకు అంతరాయం - భారత్ ఇంగ్లాండ్ రెండో టెస్టు
లార్డ్స్‌లో రెండో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. అంతా ఆసక్తిగా మ్యాచ్ తిలకిస్తున్నారు. టీమ్ఇండియా ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఓ హాస్యభరిత సంఘటన జరిగింది. అది ఏంటంటే..?
టీమిండియా
భద్రతా సిబ్బంది.. అతడిని బయటకు తీసుకొచ్చేందుకు యత్నించారు. అయితే ఆ వ్యక్తి మాత్రం.. తాను కూడా ఆడేందుకు సిద్ధమని తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఇదీ చదవండి:రాహుల్‌పై బీరు కార్క్స్.. ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం