Malaysia masters PV Sindhu: మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో చైనాకు చెందిన హి బింగ్ జియావొపై(He Bing Jiao) గెలిచింది. 21-13,17-21,21-15 తేడాతో విజయం సాధించింది. ఈ పోరు 57నిమిషాల పాటు సాగింది.
మరోవైపు స్టార్ షట్లర్ బీ సాయి ప్రణీత్ కూడా తొలి రౌండ్‌ను విజయంతో ముగించాడు. కెవిన్ కార్డెన్పై 21-8, 21-9 తేడాతో గెలిచాడు. ఈ పోరు 26నిమిషాల పాటు సాగింది. అయితే సమీర్ వర్మకు మాత్రం ఓటమి ఎదురైంది. తైవాన్‌కు చెందిన చో టైన్ చెన్పై(chou tien chen) 10-21,21-12,21-14 తేడాతో ఓడిపోయాడు.