తెలంగాణ

telangana

ETV Bharat / sports

Koneru Humpy: క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత - కోనేరు హంపి వార్తలు

ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ కోనేరు హంపి (Koneru Humpy) క్యాండిడేట్స్ చెస్ టోర్నీ(Candidates Tournament)కి అర్హత సాధించింది. ఎనిమిది మంది క్రీడాకారిణుల మధ్య జరిగే క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో విజేత.. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జు వెంజున్‌ (చైనా)తో తలపడుతుంది.

humpy
హంపి

By

Published : Jun 3, 2021, 7:51 AM IST

ప్రపంచ మహిళల ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌, తెలుగు తేజం కోనేరు హంపి (Koneru Humpy) క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ(Candidates Tournament)కి అర్హత పొందింది. ఫిడే మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో రెండో స్థానం దక్కించుకోవడం ద్వారా ఆమె ఈ ఘనత సాధించింది. ఎనిమిది మంది క్రీడాకారిణుల మధ్య జరిగే క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో విజేత.. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జు వెంజున్‌ (చైనా)తో తలపడుతుంది.

ఫిడె ఆధ్వర్యంలో జరిగే నాలుగు చెస్‌ గ్రాండ్‌ప్రిల్లో ప్రతి ఒక్కరు మూడు టోర్నీల్లో పోటీపడాల్సి ఉంటుంది. పాయింట్ల పరంగా తొలి రెండు స్థానాల్లో ఉన్నవారికి క్యాండిడేట్స్‌ టోర్నీ బెర్తు దక్కుతుంది. హంపి కేవలం రెండు టోర్నీలు ఆడినా రెండో స్థానంలో నిలవడం విశేషం. స్కాల్కోవో (రష్యా) గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన హంపి.. మొనాకో గ్రాండ్‌ప్రి టై కావడం వల్ల మరో ఇద్దరితో కలిసి పాయింట్లు పంచుకుంది. లుసానెలో జరిగిన మూడో గ్రాండ్‌ప్రికి ఆమె దూరమైంది. కరోనా కారణంగా జిబ్రాల్టర్‌ టోర్నీకి వెళ్లలేకపోయింది.

రెండు టోర్నీలే ఆడినప్పటికీ.. తన సమీప ప్రత్యర్థుల కంటే ఎక్కువ పాయింట్లు ఉండటం వల్ల హంపి (293 పాయింట్లు) క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించింది. అలెగ్జాండ్రా గోర్యచ్కినా (రష్యా) (398) అగ్రస్థానంలో నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details