కౌస్తవ్ ఛటర్జీ గ్రాండ్ మాస్టర్ అయిన నాలుగు రోజుల వ్యవధిలోనే చదరంగంలో భారత్ తరఫున మరో ప్లేయర్ జీఎమ్ హోదాను దక్కించుకున్నాడు. అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్(FIDE) సర్క్యూట్ నిర్వహించిన తొలి టోర్న్‌మెంట్‌లో రిల్టన్ కప్ టైటిల్‌ను తమిళనాడుకు చెందిన 16ఏళ్ల ఎమ్ ప్రణేశ్ ముద్దాడాడు. దీంతో ఈ యంగ్ ప్లేయర్ భారత 79వ చెస్ గ్రాండ్ మాస్టర్‌గా అవతరించాడు. స్వీడెన్లోని స్టాక్‌హౌమ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో అతడు 8 మ్యాచులు గెలుపొంది గ్రాండ్ మాస్టర్ అర్హతకు కావాల్సిన 2500 ఎలో రేటింగ్ పాయింట్స్‌ను అధిగమించాడు. అంతకుమందు ఈ గ్రాండ్ మాస్టర్ అర్హత కోసం మూడు జీఎమ్ నార్మ్స్‌ను కూడా పూర్తి చేశాడు. అలానే ఈ టోర్నీలో ఐఎమ్ కాన్ Kucuksari(స్వీడెన్), జీఎమ్ సికితా మెష్కోవ్స్(లాట్వియా)ను కన్నా ముందుగానే గేమ్స్‌ను పూర్తి చేసి పాయింట్లను గెలుచుకున్నాడు. కాగా, జీఎమ్ కావాలంటే ఓ చెస్ ప్లేయర్ మూడు జీఎమ్ నార్మ్‌లను పూర్తి చేయడంతో పాటు 2500 ఎలో రేటింగ్ పాయింట్లను సాధించాలి.
భారత్ నుంచి మరో గ్రాండ్ మాస్టర్.. ఎవరంటే? - ప్రాణేశ్ చెస్ కోచ్ ఆర్బీ రమేశ్
భారత్‌లో మరో గ్రాండ్ మాస్టర్ అవతరించాడు. తమిళనాడుకు చెందిన ఎం. ప్రణేశ్ తాజాగా రిల్టన్ కప్ పోటీలో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో భారత 79వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు.
ఈ విజయంతో ప్రణేశ్ ప్రస్తుతం 6.8 సర్క్యూట్ పాయింట్లతో ఎఫ్ఐడీఈ లిస్ట్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సంవత్సరం చివరి నాటికి అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్ 2024 ఎఫ్ఐడీఈ అభ్యర్థుల జాబితాకి అర్హత పొందుతారు. ఇక ఇదే టోర్నీలో మరో భారతీయ గ్రాండ్ మాస్టర్ ఆర్ రాజా రిత్విక్ ఆరు పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. కాగా, మొత్తంగా ఈ టోర్నీలో పాల్గొన్న 29 జాతీయ ఫెడరేషన్స్ తరఫున 136 మంది ప్లేయర్స్ బరిలోకి దిగారు.
ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ట్విట్టర్ వేదికగా 79వ గ్రాండ్‌మాస్టర్ ప్రణేశ్ను అభినందించింది. "ప్రణేశ్ చాలా ప్రాక్టికల్ ప్లేయర్, కష్టపడే మనస్తత్వం, గొప్ప ప్రతిభ కలవాడు.. ప్రణేశ్ ఓపెనింగ్స్ అంత మెరుగ్గా లేకున్నా అతని మిడిల్-గేమ్ ఇంకా ఎండ్-గేమ్ స్కిల్స్ చాలా బాగున్నాయి" అని ప్రణేశ్ కొచ్ రమేశ్ కూడా ప్రశంసించారు. ఇక 19 ఏళ్ల కౌస్తవ్ ఛటర్జీ ఇటీవల జరిగిన జాతీయ సీనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గెలిచి భారత 78వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించిన సంగతి తెలిసిందే.