తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంటినే ఆస్పత్రిగా మార్చి కరోనాపై షూటర్ విజయం

భారత షూటర్​ సమరేష్​ సింగ్​తో పాటు అతని కుటుంబం కరోనాపై విజయం సాధించింది. ఇందుకోసం ఏకంగా తన ఇంటినే ఆస్పత్రిగా మార్చేశారు. ప్రస్తుతం వైరస్​పై అవగాహన కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

samaresh
సమరేష్​

By

Published : Jun 25, 2020, 7:56 AM IST

పిస్టళ్లు సహా షూటింగ్‌కు సంబంధించిన ఇతర సామగ్రిని ఓ మూలన పెట్టేశారు. కరోనా చికిత్సకు అవసరమయ్యే మందులను అందుబాటులో ఉంచుకున్నారు. అత్యవసర సమయాల్లో ప్రాణవాయువును అందించే యంత్రాలను సమకూర్చుకున్నారు. ఇలా ఆ పెద్ద ఇంటినే చిన్నపాటి ఆసుపత్రిగా మార్చేశారు.. ఎవరికి వారు స్వీయ నిర్భందంలో ఉంటూ, అవసరమైన జాగ్రత్తలు పాటించి కరోనాను జయించారు. భారత షూటర్‌ సమరేష్‌ సింగ్‌తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు వైరస్‌పై సాధించిన విజయమిది.

ప్రస్తుతం జాతీయ పిస్టల్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న సమరేష్‌తో పాటు తన కుటుంబంలోని అయిదుగురు ప్రస్తుతం వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దాంతో ఇతరులకు వైరస్‌పై అవగాహన కల్పిస్తూ అతను ఆదర్శంగా నిలుస్తున్నాడు. "మనకు వైరస్‌ సోకదు అనే అతి విశ్వాసం మంచిది కాదు. పూర్తి జాగ్రత్తగా ఉండాలి" అని 2006 మెల్‌బోర్న్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో ఏడు పతకాలు గెలిచిన 50 ఏళ్ల సమరేష్‌ తెలిపారు.

సమరేష్​

ఇది చూడండి : గుర్రాని దౌడు తీయిస్తూ.. ట్రాక్టర్​ నడిపేస్తూ

ABOUT THE AUTHOR

...view details