తెలంగాణ

telangana

ETV Bharat / sports

ర్యాపిడ్​ చెస్​లో 'హరికృష్ణ'కు రెండో స్థానం - biel chess festival news

బియల్​ అంతర్జాతీయ చెస్​ ఫెస్టివల్​లో సత్తా చాటుతున్నాడు తెలుగు గ్రాండ్​మాస్టర్​​ పెంటేల హరికృష్ణ. ఇదే వేదికపై బ్లిట్జ్​లో టైటిల్​ గెలిచిన ఈ యువ క్రీడాకారుడు.. తాజాగా జరిగిన ర్యాపిడ్​ సెక్షన్​లో రెండో స్థానంలో నిలిచాడు.

Harikrishna finishes 2nd in rapid section of Biel Chess festival
ర్యాపిడ్​లో రెండో్ స్థానానికి పరిమితమైన హరికృష్ణ

By

Published : Jul 21, 2020, 8:14 AM IST

స్విట్జర్లాండ్​లోని బియల్‌ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ చెస్‌ ఫెస్టివల్‌లో.. తెలుగుతేజం, భారత గ్రాండ్​మాస్టర్​ పెంటేల హరికృష్ణ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. బ్లిట్జ్‌లో ఇప్పటికే టైటిల్‌ గెలుచుకున్న ఈ యువ ప్లేయర్​.. ర్యాపిడ్‌లో రెండో స్థానంతో ముగించాడు. ఈ టోర్నీలో హరి మొత్తం 10 పాయింట్లతో విన్సెంట్‌ కీమర్‌ (జర్మనీ)తో కలిసి సమానంగా నిలిచాడు.

టై బ్రేకర్‌లో నెగ్గిన హరి.. రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 12 పాయింట్లు సాధించిన రదోస్లోవ్‌ (పోలెండ్‌) టైటిల్‌ గెలుచుకున్నాడు. కరోనా మహమ్మారి తర్వాత జరుగుతున్న తొలి ముఖాముఖీ చెస్‌ టోర్నీ ఇదే.

ABOUT THE AUTHOR

...view details