తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనా భయంతో వ్యాఖ్యానానికి మాజీ ఛాంపియన్​ సెలవు

కరోనా భయంతో చెస్​ టోర్నీ వ్యాఖ్యాన బృందం నుంచి తప్పుకున్నాడు మాజీ ప్రపంచ ఛాంపియన్​ వ్లాద్​మిర్​ క్రామ్నిక్​. కొవిడ్​-19 వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రమాదకర నిర్ణయం తీసుకోలేనని చెప్పాడు. ఇదే టోర్నీలో భారత దిగ్గజ చదరంగ క్రీడాకారుడు ఆనంద్ తొలిసారి​ కామెంటేటర్​గా పనిచేస్తున్నాడు.

Former World Champion vladimir kramnik step out from candidates commentary team which involve viswanathan anand
కరోనా భయంతో వ్యాఖ్యానానికి మాజీ ఛాంపియన్​ సెలవు

By

Published : Mar 17, 2020, 11:19 PM IST

కరోనా కారణంగా ఎంతో మంది క్రీడాకారులు స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. తాజాగా ఈ వైరస్​ భయంతో కామెంటరీ బృందం నుంచి తప్పుకున్నాడు మాజీ చెస్​ ఛాంపియన్​ వ్లాద్​మిర్​ క్రామ్నిక్​. రష్యాలోని ఎక్తరిన్‌బర్గ్‌లో మంగళవారం ఆరంభమైన ఫిడే క్యాండిడేట్స్‌ టోర్నీలో.. వ్యాఖ్యానం కోసం ఇతడు ఎంపికయ్యాడు. మ్యాచ్​ ఆరంభానికి ముందు కొవిడ్​-19 భయంతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇతడి స్థానంలో ఫ్రెంచ్​ గ్రాండ్​మాస్టర్​ మాక్సిమ్​ లగ్రావేకు చోటు దక్కింది.

ఐదుగురి బృందంలో ఆనంద్​...

భారత దిగ్గజ చెస్‌ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్ తొలిసారి కామెంటేటర్​గా కనువిందు చేశాడు. తాజాగా ఆరంభమైన ఫిడే క్యాండిడేట్స్‌ టోర్నీలో ఓ వెబ్‌సైట్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఒండస్‌లీగా చెస్‌ లీగ్‌ కోసం జర్మనీ వెళ్లిన భారత ప్లేయర్​.. సోమవారం భారత్‌కు రావాల్సింది. అయితే వైరస్‌ కారణంగా ఆ దేశం విధించిన ప్రయాణ ఆంక్షల కారణంగా.. విశ్వనాథ్‌ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడ స్వీయ దిగ్బంధంలో ఉన్న అతడు తొలిసారిగా వ్యాఖ్యాత అవతారమెత్తాడు. క్రామ్నిక్​ చోటు కోల్పోయిన బృందంలో ఒక సభ్యుడిగా ఇతడు ఉన్నాడు. ఈ పోటీలు ఏప్రిల్​ 5 వరకు జరగనున్నాయి.

వ్యాఖ్యాతగా విశ్వనాథన్​ ఆనంద్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details