FIFA World Cup 2022 Fan: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. శనివారం పోలాండ్, సౌదీ అరేబియా మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన జరిగింది. అంతదాకా తన సొంత జట్టు అయిన సౌదీ అరేబియాకు సపోర్ట్ చేసిన ఒక అభిమాని.. ప్రత్యర్థి జట్టు ఆటగాడు గోల్ కొట్టగానే దెబ్బకు ప్లేట్ ఫిరాయించాడు.
'నువ్వయ్యా అసలు సిసలైన అభిమానివి.. ఒక్క గోల్‌కు ప్లేట్ ఫిరాయించావుగా!' - ఫిఫా వరల్డ్ కప్ 2022 అప్డేట్లు
ఫిఫా ప్రపంచకప్‌లో అభిమానుల సందడి ఏ విధంగా ఉంటుందో తెలిసిందే. తమ జట్టు గోల్ కొడితే చాలు.. వారి సంబరాలకు హద్దే ఉండదు. అయితే.. ప్రత్యర్థి జట్టు ఆటగాడు గోల్ కొడితే.. ఓ అభిమాని సంబరాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. పొలాండ్ ఆటగాడు గోల్ కొడితే.. సౌదీ అరేబియా అభిమాని ఒకరు తాను ధరించిన జెర్సీ మార్చుకుని మరీ సంబరాలు చేసుకున్నాడు.
అప్పటిదాకా సౌదీ.. సౌదీ అని అరిచిన నోటి నుంచి లెండోవాస్కీ పేరు బయటకు వచ్చింది. అంతేకాదు తాను వేసుకున్న సౌదీ అరేబియా జెర్సీని తీసేసి లోపల వేసుకున్న లెండోవాస్కీ జెర్సీని చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ''నువ్వయ్యా అసలైన అభిమానివి.. దెబ్బకు ప్లేట్ ఫిరాయించావు.. నీలాంటోడు ఉండాల్సిందే'' అంటూ పేర్కొన్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో పొలాండ్ సౌదీ అరేబియాను 2-0తో ఓడించింది. మ్యాచ్‌లో పొలాండ్ కెప్టెన్ రాబర్ట్ లెండోవాస్కీ గోల్ నమోదు చేశాడు. కాగా తొలి వరల్డ్‌కప్ ఆడుతున్న లెండోవాస్కీకి ఇదే తొలి గోల్ కావడం విశేషం. అంతకముందు తొలి అర్థభాగంలో ఆట 39వ నిమిషంలో జిలిన్ స్కీ పోలాండ్‌కు తొలి గోల్ అందించాడు. మొదటి హాఫ్ అదనపు సమయంలో సౌదీ అరేబియాకు పెనాల్టీ లభించింది. దీంతో కచ్చితంగా గోల్ చేస్తుంది అన్న తరుణంలో పొలాండ్ గోల్ కీపర్ వోజిక్ జెన్సీ రెండుసార్లు అద్బుతంగా అడ్డుకొని సౌదీకి గోల్ రాకుండా చేశాడు. ఇది మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక అర్జెంటీనాకు షాక్ ఇచ్చిన సౌదీ అరేబియా ఆటలు పొలాండ్ ముందు సాగలేదు.