తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్ వాయిదాతో నిరాశపడ్డ స్టార్ షూటర్ మను​ - ఒలింపిక్స్​ వాయిదాతో నిరాశ చెందిన మను

'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా ముచ్చటించిన యువ షూటర్ మను బాకర్.. ఎక్స్​క్లూజివ్​ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించింది. బాలీవుడ్​ సినిమాలు, వంట, ఒలింపిక్స్ తదితర అంశాల గురించి మాట్లాడింది.

'ఈటీవీ భారత్'తో స్టార్ షూటర్ మను బాకర్
మహిళా షూటర్ మను బాకర్

By

Published : May 31, 2020, 10:55 AM IST

Updated : May 31, 2020, 11:45 AM IST

టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటం వల్ల చాలా నిరాశ చెందానని చెప్పింది భారత యువ మహిళా షూటర్ మను బాకర్. అయినా ఫిట్​నెస్​పై దృష్టి పెట్టినట్లు తెలిపింది. 'ఈటీవీ భారత్​'తో శనివారం జరిగిన ఎక్స్​క్లూజివ్​ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

భారత మహిళా షూటర్ మను బాకర్​తో ఈటీవీ భారత్ ఎక్స్​క్లూజివ్

అటు చదువును, ఇటు షూటింగ్​.. ఇలా రెండు విషయాల్ని మేనేజ్​ చేస్తూ లాక్​డౌన్​ను ఆస్వాదిస్తున్నానని మను తెలిపింది. ఇటీవలే ఈమె క్రీడా విభాగంలో అర్జున అవార్డు, ఖేల్​రత్న అవార్డులకు నామినేట్ అయింది.

ఈ లాక్​డౌన్ సమయంలో వంట నేర్చుకుంటున్నారా? అన్న ప్రశ్నకు.. "నాకు వంట చేయడం ఇష్టముండదు. కానీ ఏదో అప్పుడప్పుడు చేస్తుంటాను" అని మను చెప్పింది. మూడో గ్రేడ్​లో ఉన్నప్పటి నుంచి క్రీడల్లో పాల్గొంటున్నానని, ఈ విషయంలో ప్రోత్సాహం అందిస్తున్న తల్లిదండ్రులు తనకు ఉండటం నిజంగా అదృష్టమని పేర్కొంది.

భారత యువ మహిళా షూటర్ మను బాకర్
Last Updated : May 31, 2020, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details