తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పాక్​ ఆటగాడు నా జావెలిన్​ తీసుకుంటే తప్పేంటి?'

ఫైనల్లో పాక్​ ఆటగాడు ఆర్షాద్​ నదీమ్​ భారత స్టార్​ అథ్లెట్​ నీరజ్​ చోప్డా జావెలిన్​ తీసుకోవడంపై వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన నీరజ్​.. పలువురు వ్యవహరించిన తీరు బాధ కలిగిస్తోందన్నాడు. ఆర్షాద్​ తన జావెలిన్​ను తీసుకోవడంలో తప్పేమీ లేదని స్పష్టం చేశాడు.

neeraj chopra, నీరజ్​ చోప్రా
'పాక్​ ఆటగాడు నా జావెలిన్​ తీసుకుంటే తప్పేంటి?'

By

Published : Aug 26, 2021, 10:03 PM IST

ఒలింపిక్స్​ ఫైనల్​కు ముందు తన జావెలిన్​ కనిపించక కంగారు పడ్డాడని.. ఆ జావెలిన్,​ పాకిస్థానీ ఆటగాడు ఆర్షద్​ నదీమ్​ చేతిలో ఉందని స్టార్​ అథ్లెట్​ నీరజ్​ చోప్డా ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై వివాదం చెలరేగింది. ఆర్షాద్​ నదీమ్​ చేతిలో నీరజ్​ జావెలిన్​ ఉండటాన్ని తప్పుపడుతూ పలువురు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన నీరజ్​.. ఈ వివాదానికి సంబంధించి పలువురు స్పందించిన తీరు తనకు బాధ కలిగిస్తోందన్నాడు. స్వలాభాలకు, దుష్ప్రయోజనాలకు తన పేరు వాడొద్దని స్పష్టం చేశాడు.

అందులో తప్పేమీ లేదు..

ఆర్షాద్​ తన జావెలిన్​ను తీసుకోవడంలో తప్పేమీ లేదన్నాడు నీరజ్​.

"ఆ సమయంలో ఆర్షాద్​ ఆటకు సన్నద్ధం అయ్యేందుకు నా జావెలిన్​ తీసుకున్నాడు. అందులో తప్పేమీ లేదు. అందరి దగ్గర సొంత జావెలిన్​లు ఉన్నా మరోకరి జావెలిన్​ను వాడుకోవచ్చు. ఆ విషయం నిబంధనల్లో కూడా ఉంది. క్రీడలు ఐక్యమత్యాన్ని నేర్పిస్తాయి. తోటి జావెలిన్​ ఆటగాళ్లతో అందరం స్నేహపూర్వకంగానే ఉంటాం."

-నీరజ్​ చోప్డా, జావెలిన్​ అథ్లెట్

నీరజ్​ వ్యాఖ్యలను అతని మాజీ కోచ్​ సమర్థించారు. ఒకరి జావెలిన్​ మరొకరు వాడకూడదని నిబంధన ఏం లేదని తెలిపారు.

ఇదీ చదవండి :టీమ్​ఇండియా ఘోర ప్రదర్శన.. తప్పు పిచ్​దా?

ABOUT THE AUTHOR

...view details