తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ పొరపాటు వల్లే ఇదంతా.. క్షమించండి: జకోవిచ్ - నొవాక్ జకోవిచ్ లేటెస్ట్​ న్యూస్

Djokovic Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్​ కోసం అధికారులకు సమర్పించిన కొవిడ్​ ధ్రువపత్రాల్లో ఓ చిన్న పొరపాటు జరిగిందని టెన్నిస్ క్రీడాకారుడు జకోవిచ్ వివరణ ఇచ్చాడు. తాను టెన్నిస్ ప్రోగ్రాం పాల్గొనే సమయానికి కొవిడ్​ ఫలితాలు ఇంకా రాలేదని అన్నాడు. ఈ మేరకు క్షమాపణలు చెబుతూ ఇన్​స్టాలో ఓ పోస్ట్​ పెట్టాడు.

Djokovic
నొవాక్ జకోవిచ్

By

Published : Jan 12, 2022, 1:12 PM IST

Updated : Jan 12, 2022, 2:43 PM IST

Djokovic Australian Open: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సమర్పించిన ధ్రువపత్రాల్లో తప్పు జరిగిందని టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్​​ చెప్పాడు. జకోవిచ్​.. ఆస్ట్రేలియాకు వచ్చే 14 రోజులు ముందు వరకు ఎక్కడికైనా ప్రయాణించాడా? అన్న ప్రశ్నకు.. తన సహాయ సిబ్బందిలోని కొందరు సభ్యులు.. పొరపాటున 'నో' అని ఎంట్రీ ఇచ్చారని అన్నాడు.

తనకు కొవిడ్​-19 వచ్చిందని తెలిసి కూడా జకోవిచ్​.. ఓ ఇంటర్వూతో పాటు బెల్​గ్రేడ్​లో ఓ టెన్నిస్ కార్యక్రమంలో పాల్గొన్నాడని మీడియాలో వస్తున్న కథనాలపైనా వివరణ ఇచ్చాడు.

"టెన్నిస్ కార్యక్రమంలో పాల్గొనే సమయానికి నా కొవిడ్ పరీక్ష రిపోర్ట్ ఇంకా రాలేదు. ఆ సమయంలో నాకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. అయితే నేను ఇంటర్వ్యూ, టెన్నిస్​ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు క్షమాపణలు చెబుతున్నా" అని జకోవిచ్ పేర్కొన్నాడు​.

ఏమైందంటే?

ఈ సెర్బియన్‌ ఆటగాడు గతవారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టగానే బోర్డర్‌ ఫోర్స్ అధికారులు అడ్డుకున్నారు. వాక్సినేషన్‌కు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేనందున అతడి వీసాను రద్దు చేయడం సహా అతడిని ఇమ్మిగ్రేషన్‌ నియంత్రణలోకి తీసుకుని ప్రత్యేక హోటల్‌కు తరలించింది.

ఈ నేపథ్యంలోనే న్యాయపోరాటం చేసిన జకోవిచ్‌.. ఈ కేసులో గెలిచాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు అతడి వద్ద వైద్యపరమైన మినహాయింపులకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని, దీంతో అతడి వీసాను పునరుద్ధరించాలని న్యాయమూర్తి ఆంటోని కెల్లీ ఆదేశాలిచ్చారు.

ఈ క్రమంలోనే జకోవిచ్‌ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఇక పదోసారి ఆస్ట్రేలియన్‌ టైటిల్‌ కైవసం చేసుకొని తన కెరీర్‌లో 21వ గ్రాండ్‌ స్లామ్‌ సాధించాలని ఆసక్తిగా ఉన్నాడు.

ఇవీ చూడండి:కరోనా సోకిన మరునాడే టోర్నీలో.. జకోవిచ్ తీరుపై విమర్శలు

నంబర్​ వన్​గానే బరిలోకి జకోవిచ్.. ప్రాక్టీస్​ షురూ..

Last Updated : Jan 12, 2022, 2:43 PM IST

ABOUT THE AUTHOR

...view details