తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ నం.1 అపూర్వి .. రెండో స్థానంలో అన్జుమ్ - anjum

భారత షూటర్లు తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. మహిళా షూటర్ అపూర్వి చందేలా తొలి స్థానంలో నిలవగా... అన్జుమ్ మౌద్గిల్ రెండో ర్యాంకును చేజిక్కించుకుంది. పురుషులలో దివ్యాంశ్​ 10 మీటర్ల ఎయిర్​ రైఫిల్ ఈవెంట్​లో నాలుగో స్థానానికి ఎగబాకాడు.

ర్యాంకింగ్స్

By

Published : May 1, 2019, 8:38 PM IST

భారత మహిళా షూటర్ అపూర్వి చందేలా ప్రపంచ నంబర్ వన్​ ర్యాంకు సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్​ రైఫిల్ విభాగంలో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న అపూర్వి అగ్రస్థానంలో నిలిచింది. మరో షూటర్ అన్జుమ్ మౌద్గిల్ రెండో ర్యాంకు సాధించింది. ఇప్పటికే వీరిద్దరూ 2020 టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించారు.

ఫిబ్రవరిలో జరిగిన ఐఎస్​ఎస్​ఎఫ్​ ప్రపంచకప్​లో 252.9 పాయింట్ల వరల్డ్ రికార్డుతో స్వర్ణాన్ని చేజిక్కించుకుంది అపూర్వి చందేలా. అలాగే 2014 కామన్​వెల్త్​ క్రీడల్లో పసిడి గెలవగా.. 2018లో కాంస్య పతకం సాధించింది.

"షూటింగ్​​లో ప్రపంచ నంబర్​ వన్​గా నిలవడం నా కెరీర్​లో మైలురాయిగా నిలిచిపోతుంది" అని ట్విట్టర్​లో తన ఆనందాన్ని పంచుకుంది చందేలా.

చైనా బీజింగ్​లో జరిగిన ఐఎస్​ఎస్ఎఫ్ ప్రపంచకప్​లో స్వర్ణాన్ని గెలిచిన మౌద్గిల్ తాజాగా నెంబర్ 2 ర్యాంకును చేజిక్కించుకుంది. 10 మీటర్ల ఎయిర్​ రైఫిల్​ విభాగంలో ఈ ఘనత సాధించింది. మను బాకర్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో 10వ ర్యాంకులో నిలిచింది.

పురుషుల విభాగంలో దివ్యాంశ్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్​ ఈవెంట్​లో 4వ ర్యాంకు సాధించాడు. అభిషేక్ వర్మ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details