2024 పారిస్ ఒలింపిక్స్లో బ్రేక్ డ్యాన్సింగ్తో పాటు మరో మూడు క్రీడలను ప్రవేశ పెట్టేందుకు ముందడగు పడింది. బ్రేక్ డ్యాన్సింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్ క్రీడలను పారిస్ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. వచ్చే జూన్లో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సమావేశమై ఈ అంశంపై చర్చించనుంది.
2024 ఒలింపిక్స్లో బ్రేక్డ్యాన్సింగ్ ఈవెంట్! - బ్రేక్ డ్యాన్సింగ్
బ్రేక్ డ్యాన్సింగ్తో పాటు మరో మూడు క్రీడలను 2024 పారిస్ ఒలింపిక్స్లో చేర్చేందుకు ముందడగు పడింది. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం జూన్లో సమావేశమై ఈ అంశంపై నిర్ణయం తీసుకోనుంది.
బ్రేక్ డ్యాన్సింగ్
ఈ నాలుగు క్రీడలపై చర్చించి 2020 డిసెంబర్ కల్లా తుది నిర్ణయం తీసుకోనుంది ఐఓసీ. జూన్ 24 నుంచి 26 వరకు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ప్యానెల్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఆస్ట్రేలియాకు చెందిన జాన్ కోట్స్ ప్యానెల్ ఛైర్పర్సన్గా వ్యవహరించనున్నారు.