ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సత్తాచాటారు. థాయ్‌లాండ్ బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో శివథాప, సరితా దేవి సెమీస్‌కు దూసుకెళ్లారు. పురుషుల 60 కేజీల విభాగంలో వరుసగా నాలుగో సారి ఆసియన్ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు శివథాప. 60 కేజీల మహిళల విభాగంలో దాదాపు దశాబ్దం తర్వాత తొలిసారి సెమీస్ చేరింది సరితా దేవి.
ఆసియన్ బాక్సింగ్‌లో భారత బాక్సర్ల హవా - boxing
బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సెమీస్‌కు దూసుకెళ్లారు. 60 కేజిల విభాగంలో శివథాప, సరితాదేవి టోర్నీలో పతకాన్ని ఖాయం చేసుకున్నారు. నాలుగోసారి సెమీస్‌కు చేరాడు శివథాప.
శివథాప - సరితా దేవి
క్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన రుజుక్రాన్ని 5-0 తేడాతో మట్టికరిపించాడు శివ. సెమీస్‌లో కజకిస్థాన్ జకీర్‌తో తలపడనున్నాడీ 25 ఏళ్ల బాక్సర్. శివథాప 2013లో బంగారు పతకాన్ని గెలవగా, 2015లో కాంస్యం సొంతం చేసుకున్నాడు. 2017లో వెండి పతకాన్ని కైవసం చేసుకోగా... తాజాగా మరోసారి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. సరితా దేవి చివరిగా 2010లో స్వర్ణాన్ని గెల్చుకుంది.
ఇది చదవండి: నేటి మ్యాచ్‌కు సన్‌రైజర్స్ సారథి దూరం