FIFA WC 2022 Belgium Riots: ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియంపై మొరాకో జట్టు సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఖతార్‌లో అల్ థుమమ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 2-0 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ అయిన బెల్జియంను మొరాకో మట్టికరిపించింది. ఈ విజయంతో మొరాకో గ్రూప్-ఎఫ్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. బెల్జియం రెండో స్థానానికి పడిపోయింది. అయితే ఈ మ్యాచ్ బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఉద్రిక్తతలకు దారితీసింది.
FIFA WC 2022: మొరాకో చేతిలో ఓటమి.. బెల్జియంలో చెలరేగిన అల్లర్లు.. బైక్‌లు కార్లు ధ్వంసం! - బెల్జియం ఫిఫా కప్
ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా మొరాకో చేతిలో బెల్జియం ఓడిపోవడంతో స్వదేశంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. వందలాది మంది అభిమానులు రోడ్లపైకి చేరి ఆందోళనలు చేపట్టారు. కారుతో సహా పలు ఎలక్ట్రిక్ స్కూటర్లకు నిప్పంటించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
బ్రెజిల్ పరాజయాన్ని జీర్జించుకోలేని పలువురు ఫుట్‌బాల్ అభిమానులు మొరాకో జెండాలు పట్టుకొని రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించారు. కొందరు కర్రలతో దాడి చేస్తూ వాహనాలపై రాళ్లు రువ్వారు. కారుతో సహా పలు ఎలక్ట్రిక్ స్కూటర్లకు నిప్పంటించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాదాపు 12 మందిని అదుపులోకి తీసుకోగా ఒకరిని అరెస్ట్ చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
బెల్జియం రాజధాని అంతటా అనేక చోట్ల ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయని, సాయంత్రం 7 గంటల వరకు పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పబ్లిక్ హైవేపై అల్లరి మూకలు పైరోటెక్నిక్ మెటీరియల్, కర్రలతో దాడి చేశారని, వాహనాలకు నిప్పంటించారని పోలీసులు తెలిపారు. బాణా సంచా పేల్చడంతో ఓ జర్నలిస్టు ముఖానికి గాయమైనట్లు పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల తాము జోక్యం చేసుకొని జల ఫిరంగులను, టియర్ గ్యాస్ ఉపయోగించినట్లు తెలిపారు.