సాధారణంగా రాజకీయ నాయకుల సమావేశాలకో, సినీ హీరోని చూడటానికో ప్రేక్షకులు భారీగా వస్తుంటారు. కానీ తమ జట్టు గెలిచిందని అర్ధరాత్రి పూట వేలమంది కలిసి సంబురాలు చేసుకున్నారు అమెరికాలో వర్జీనియా ప్రజలు.
అర్ధరాత్రి పూట అవధుల్లేని అభిమానం! - వర్జీనియా
తమ జట్టు గెలిచిందని వేల మంది ప్రజలు ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి సంబురాలు చేసుకున్నారు. అమెరికాలోని వర్జీనియా-టెక్సాస్ మధ్య జరిగిన జాతీయ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్లో వర్జీనియా జట్టు విజయం సాధించింది.
అభిమానులు
వర్జినీయా క్యావలీర్స్, టెక్సాస్ జట్ల మధ్య జాతీయ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్సోమవారంజరిగింది. ఈ పోరులో టెక్సాస్పై వర్జీనియా 85-77 పాయింట్ల తేడాతో నెగ్గింది. అంతే వర్జీనియా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వీధుల్లో వేల మంది హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు... వర్జీనియా జట్టు తొలిసారి జాతీయ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకుంది.