తెలంగాణ

telangana

ETV Bharat / sports

Olympics: టోక్యోలో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు

ఒలింపిక్స్ కోసం టోక్యోకు చేరుకుంది ఆస్ట్రేలియా సాఫ్ట్‌బాల్ జట్టు. ఈ క్రమంలోనే కరోనా పరిస్థితుల నేపథ్యంలో జపాన్​లో అడుగుపెట్టిన తొలి విదేశీ టీమ్​గా నిలిచింది.

Australian softball team among the earliest to arrive in Japan for Olympics
Olympics: టోక్యోలో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు

By

Published : Jun 1, 2021, 11:42 AM IST

జపాన్‌లో జరగనున్న ఒలింపిక్స్‌ కోసం ఆ దేశంలో అడుగుపెట్టిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా సాఫ్ట్‌బాల్ టీమ్ రికార్డు సృష్టించింది. గతేడాదే నిర్వహించాల్సిన టోక్యో ఒలింపిక్ క్రీడలు కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి.

ఇప్పటికీ ప్రపంచాన్ని కొవిడ్ వదలకపోవడం వల్ల ఈ క్రీడల నిర్వహణ విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. స్థానికంగా కొందరు వ్యతిరేకించడమే ఇందుకు కారణం. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు చెందిన సాఫ్ట్‌బాల్ ఆటగాళ్లు టోక్యో నగరానికి వెలుపల ఉన్న నరిట విమానాశ్రయంలో తమ సహాయక సిబ్బందితో కలిసి అడుగుపెట్టారు. ఇది ఈ మెగాక్రీడల నిర్వాహకులకు ఊరటనిచ్చే విషయమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: 'టోక్యో ఒలింపిక్స్ కోసం భారత్ రె'ఢీ''

ABOUT THE AUTHOR

...view details