Australian Open 2024 Sumit Nagal : భారత టెన్నిస్ సింగిల్స్ ఆటగాడు సుమిత్ నగాల్ ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో సంచలనం సృష్టించాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ 27వ ర్యాంకర్ (31వ సీడ్) కజకిస్థాన్‌కు చెందిన ప్లేయర్ అలెగ్జాండర్ బబ్లిక్‌ను ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. ఇతడిని మూడు వరుస సెట్లలో ఓడించాడు. దీంతో గ్రాండ్ స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన రెండో భారత ఆటగాడిగా చరిత్ర లిఖించాడు.
Sumit Nagal Vs Bublik : మూడేళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీకి అర్హత సాధించిన సుమిత్ నగాల్ తన అద్భుతమైన ప్రదర్శనతో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్స్ ర్యాంకింగ్స్‌లో 139వ స్థానంలో కొనసాగుతున్న అతడు తొలి రౌండ్‌లో దిగ్గజ ఆటగాడైన బబ్లిక్‌ను ఓడించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో అలెగ్జాండర్ బబ్లిక్‌పై సుమిత్ 6-4, 6-2, 7-6 (7-5)తో గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.
ఇదే తొలిసారి :దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలోనే ఓ సీడెడ్ ఆటగాడిని భారత్‌కు చెందిన క్రీడాకారుడు ఓడించడం ఇదే తొలిసారి. అంతకుముందు(1989లో) టెన్నిస్ దిగ్గజం రమేశ్ కృష్ణన్ అప్పటి ప్రపంచ నంబర్ 1 ఛాంపియన్ మ్యాట్స్ విలాండర్(స్వీడెన్)పై రెండో రౌండ్‌లో నెగ్గాడు.