Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ సారి సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ఎవరూ అర్హత సాధించలేకపోయారు. టీమ్‌ఇండియా ఆటగాడు యుకీ బాంబ్రి తన రెండో రౌండ్ క్వాలిఫయిర్స్ మ్యాచ్‌లో 1-6, 3-6 తేడాతో టామస్ మచాక్ చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో భారత్‌కు ఉన్న చివరి ఆశలు ఆవిరయ్యాయి. చెక్ రిపబ్లిక్ ఆటగాడు టామస్ ఆది నుంచే యుకీపై ఆధిక్యత ప్రదర్శించాడు. అయితే రెండో సెట్‌లో యుకీ కాస్త ప్రతిఘటించాడు. కానీ ఆఖరికి విజయం టామస్‌నే వరించింది.
రెండు రోజుల కిందట తొలి రౌండ్‌లో పోర్చుగీస్ ఆటగాడు డొమింగూస్‌పై 6-4, 6-2 తేడాతో సులువుగా గెలిచిన యుకీ కీలకమైన రెండో రౌండ్‌లో మాత్రం తేలిపోయాడు. మహిళల సింగిల్స్ క్రీడాకారిణి అంకితా రైనా కూడా ఓడిపోయింది. ఉక్రెయిన్ ప్లేయర్ లెసియా సురెంకో చేతిలో 6-1, 6-0 తేడాతో పరాజయం పాలైంది. మరో భారత ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు.
ఇదీ చదవండి: