Asian Games 2023 Full List :ఆసియా ఖండంలోనే అతి పెద్ద క్రీడా సంబరం దగ్గరికి వచ్చేస్తోంది. హాంగ్‌జౌ వేదికగా ఈ క్రీడలు శనివారం(సెప్టెంబర్ 23) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఈ ఆసియా క్రీడల విశేషాలను తెలుసుకుందాం..
- ఒలింపిక్స్ తర్వాత ఆసియా క్రీడలే అతి పెద్దవి. భారత్ సహా 45 దేశాలు పోటీపడనున్నాయి. వాలీబాల్, ఫుట్‌బాల్, వాలీబాల్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. భారత్ క్రికెట్లోనూ పోటీపడడం విశేషం.
- చైనాలోని హాంగ్‌జౌ నగరం.. ఈ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది. స్క్వాష్, బ్యాడ్మింటన్, టెన్నిస్ సహా ఇతర ఆటలు ఎక్కువగా ఈ నగరంలోనే నిర్వహిస్తారు. ఇంకా మరో ఐదు నగరాల్లోనూ కొన్ని గేమ్స్ జరుగుతాయి.
- మొత్తంగా వివిధ దేశాల నుంచి 11 వేల మందికి పైగా అథ్లెట్లు పోటీల్లో పాల్గొంటారు. 1000కిపైగా మెడల్స్‌ను అందుబాటులో ఉంచుతారు.
- ఇకపోతే ఈ ఆసియా క్రీడల్లో ఈ సారి కూడా అత్యుత్తమ ప్రదర్శనతో 100 మెడల్స్‌ను ముద్దాడాలనే లక్ష్యంతో.. 655 మంది సభ్యుల బలమైన బృందంతో భారత్ బరిలోకి దిగబోతుంది. ఏషియాడ్‌లో భారత్‌కు ఇదే అతి పెద్ద బృందం కావడం విశేషం.
- 41 క్రీడాంశాల్లో మన అథ్లెట్లు పోటీపడనున్నారు. అత్యధికంగా అథ్లెటిక్స్ జట్టులో 68 మంది ఉన్నారు.
- 2018 ఆసియా క్రీడల్లో భారత్ 15 గోల్డ్ మెడల్స్, 24 సిల్వర్ మెడల్స్ సహా 69 పతకాలు గెలుచుకుంది. అంటే మొత్తం 108 గెలుచుకుంది. క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇదే కావడం విశేషం. ఇప్పుడు ఆటగాళ్ల ప్రమాణాలు మరింత పెరిగినాయి కాబట్టి.. ఈ సారి పతకాల సెంచరీ కొట్టడం అసాధ్యమేమీ కాదని భారత్ భావిస్తోంది.
- వీరిపై భారీగా ఆశలు.. ఒలింపిక్, వరల్డ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా(Asian games 2023 neeraj chopra) గోల్డ్ సాధిస్తాడని అంతా అనుకుంటున్నారు. నీరజ్‌తో పాటు ( మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్ డబుల్స్), జ్యోతి సురేఖ (ఆర్చరీ), తేజస్విన్ శంకర్ (డెకథ్లాన్), రుద్రాంక్ష్ పాటిల్ (షూటింగ్), పారుల్ చౌదరి (3000మీ స్టీపుల్ చేజ్), రోహన్ బోపన్న (టెన్నిస్ డబుల్స్), జ్యోతి యర్రాజి (100మీ హర్డిల్స్), పురుషుల హాకీ జట్టు, భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు.
- టాప్-5లో భారత్.. ఇక ఈ ఆసియా గేమ్స్ హిస్టరీలో పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే.. భారత్ టాప్-5లో ఉంది. 1951లో మొదటి సారి జరిగిన ఏషియాడ్‌కు ఆతిథ్యమిచ్చినప్పటి నుంచి భారత్ పోటీపడుతోంది. ఈ క్రీడల్లో ఇప్పటివరకు 155 గోల్డ్ మెడల్స్‌తో సహా మొత్తంగా 672 మెడల్స్‌ను ఖాతాలో వేసుకుంది. తొలి రెండు స్థానాల్లో చెరో మూడు వేలకు పైగా మెడల్స్‌తో చైనా, జపాన్ ఉన్నాయి.