Archery World Cup 2022: తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ ఖాతాలో మరో పతకం చేరింది. ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3 టోర్నీ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ- జ్యోతి సురేఖ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం సెమీఫైనల్లో అభిషేక్-జ్యోతి జంట 156-151తో రాబిన్ జాత్మా- లిజెల్ జాత్మా (ఇస్తోనియా) జంటపై విజయం సాధించింది. అంతకుముందు ఎల్ సాల్వడోర్ బృందంతో క్వార్టర్‌ఫైనల్లో జ్యోతి జంటకు కఠిన పోరు ఎదురైంది. 155-155తో స్కోరు సమం కాగా భారత ద్వయం షూటాఫ్‌లో విజయం సాధించింది. శనివారం ఫైనల్లో అయిదో సీడ్ ఫ్రాన్స్‌తో సురేఖ-అభిషేక్ జోడీ తలపడుతుంది.
ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో సురేఖ జోడీ - ఆర్చరీ ప్రపంచకప్
Archery World Cup 2022: ఆర్చరీ ప్రపంచకప్‌లో తన హవా కొనసాగిస్తోంది తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ. స్టేజ్-3 టోర్నీ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ- జ్యోతి సురేఖ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత పెద్ద టోర్నీలో బరిలో దిగిన ప్రపంచ నం.3 జ్యోతి వ్యక్తిగత విభాగంలోనూ పతకం దిశగా సాగుతోంది. ఇప్పటికే ఆమె సెమీస్ చేరుకుంది. రికర్వ్‌లో భారత మహిళల జట్టు ఇప్పటికే ఫైనల్ చేరుకుని పతకం ఖాయం చేసుకుంది. రికర్వ్ మిక్స్‌డ్‌లో తరుణ్‌దీప్ రాయ్- అంకిత జోడీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి రౌండ్లో షూటాఫ్‌లో రాయ్- అంకిత జోడీ 4-5 (18-20)తో కజకిస్తాన్ జంట చేతిలో జోడీ ఓడింది.
ఇదీ చూడండి:ఒకే ఒక్కడు 'మిచెల్'.. ఇంగ్లాండ్‌పై 400 పరుగులు చేసి రికార్డు!