వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు అంతా సిద్ధమవుతున్న వేళ... భారత ఆర్చరీ బృందానికి గొప్ప ఊరట లభించింది. భారత ఆర్చరీ సంఘం(ఏఏఐ) గుర్తింపును ఎట్టకేలకు ఎనిమిదేళ్ల తర్వాత పునరుద్ధరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని ఏఏఐ అధ్యక్షుడు అర్జున్ ముండా తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
"ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ గుర్తింపును పునరుద్ధరించినందుకు క్రీడా మంత్రి కిరన్ రిజిజుకు అభినందనలు. దీనిద్వారా భారత విలువిద్యకు కొత్త అధ్యాయాన్ని తెరిచినట్లైంది. ఆటగాళ్లలో నూతనోత్సాహం కలుగుతుంది. నిజం గెలిచింది."