జర్మనీ మ్యూనిక్ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్‌లో భారత షూటర్ స్వర్ణం నెగ్గింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అపూర్వీ చండేలా బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
షూటింగ్ ప్రపంచకప్‌లో స్వర్ణం నెగ్గిన అపూర్వీ - స్వర్ణం
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ అపూర్వీ స్వర్ణం గెలుచుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 251 పాయింట్లు సాధించి పసిడిని కైవసం చేసుకుంది. ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన ప్రపంచకప్‌లోనూ బంగారు పతకాన్ని నెగ్గింది అపూర్వీ.
తుదిపోరులో 251 పాయింట్ల సాధించిన ఈ జైపుర్ షూటర్..అగ్రస్థానంలో నిలిచింది. చైనాకు చెందిన వాంగ్ లుయో 250.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. మరో చైనీస్ షూటర్ గ్జూ హాంగ్ 229.4 పాయింట్లతో కాంస్యాన్ని సాధించింది.
ఫిబ్రవరిలో దిల్లీ వేదికగా జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లోనూ అపూర్వీ స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. ఒకే ఏడాది వరల్డ్‌కప్‌లో రెండు స్వర్ణాల నెగ్గిన షూటర్‌గా అపూర్వీ ఘనత సాధించింది. ఇప్పటికే 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిందీ జైపుర్ షూటర్. అపూర్వీతో పాటు సౌరభ్ చౌదురీ, అభిషేక్ వర్మ, దివ్యాంశ్ సింగ్ పన్వార్‌లు టోక్యో ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకున్నారు.