జపాన్‌లోని మంచు పర్వతాల్లో యాడ్ షూట్ కోసం వెళ్లిన ఓ బృందం అక్కడి హిమపాతంలో కూరుకుపోయారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆస్ట్రియన్‌కు చెందిన ఓ స్కీయర్తో పాటు అమెరికాకు చెందిన మాజీ వరల్డ్ ఛాంపియన్ స్కీయింగ్ స్టార్ కైల్ స్మెయిన్ మరణ వార్త విన్న యావత్ క్రీడా ప్రపంచం షాక్‌కు గురయ్యింది. జనవరి 29న జపాన్‌లోని నాగానో ప్రిఫెక్చర్‌లోని 2,469 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ హకుబా నోరికురాకు వెళ్లిన టీమ్..షూటింగ్ ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు మౌంటెన్‌గెజిట్ ఫోటోగ్రాఫర్ గ్రాంట్ గండర్సన్ తెలిపాడు. ప్రమాదం జరిగిన తర్వాత వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని టీమ్ తెలిపింది.
హిమ పాతంలో ఇరుక్కుని ఛాంపియన్ స్కీయర్ మృతి.. షాక్‌లో అభిమానులు..!
జపాన్‌లోని మంచు పర్వాతాల్లో జరిగిన ఓ ప్రమాదంలో అమెరికాకు చెందిన స్టార్ స్కీయర్ కైల్ స్మెయిన్ మృతి చెందాడు. కాగా ఓ యాడ్ షూట్ కోసం వెళ్లిన ఈ బృందంలోని మరో స్కీయర్ కూడా మృతి చెందినట్లు ఓ వార్త పత్రిక వెల్లడించింది.
అయితే స్మెయిన్ చనిపోవడానికి ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.''పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పటికి స్కీయింగ్‌పై నాకున్న అభిమానం ఎంత కష్టమున్నా లెక్కచేయనివ్వదు. కష్టంలోనే మన సక్సెస్ ఏంటో తెలుస్తుంది'' అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. కాగా 1991, జూన్ 27న అమెరికాలో జన్మించిన కైల్ స్మెయిన్.. చిన్నప్పటి నుంచే కొండలు, గుట్టలపై క్లైంబింగ్ చేయడం చాలా ఇష్టం. ఆ ఇష్టాన్నే హాబీగా మార్చుకున్న స్మెయిన్.. ఆ తర్వాత స్కీయర్‌గా మారాడు. 2015లో ఎఫ్‌ఐఎస్ ఆల్పైన్ వరల్డ్ స్కై ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 2018 ఒలింపిక్స్‌లో స్కీయింగ్‌లో పాల్గొన్న తొలి అమెరికన్ అథ్లెట్‌గా కైల్ స్మెయిన్ ఘనత సాధించాడు.