జాతీయ క్రీడా పురస్కారాల విజేతలను నిర్ణయించేందుకు 12 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ. ఈ బృందమే ఆటగాళ్లు, కోచ్‌లను అవార్డుల కోసం ఎంపిక చేయనుంది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ మేరీకోమ్, భారత మాజీ ఫుట్‌బాల్ కెప్టెన్ బైచుంగ్ భూటియాలకు ఈ సెలక్షన్ ప్యానెల్లో చోటు దక్కింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ముకుందం శర్మ అధ్యక్షత వహిస్తున్నారు.
ఈ బృందంలో క్రీడాశాఖ సెక్రటరీ రాథే శ్యామ్ జులానియాతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) సీఈఓ కమాండర్ రాజేశ్ రాజగోపాలన్, మాజీ మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా, మాజీ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్, టేబుల్ టెన్నిస్ కోచ్ కమలేశ్ మెహతా ఉన్నారు. వీరితో పాటు టైమ్స్ గ్రూప్ డిజిటల్ విభాగం చీఫ్ ఎడిటర్ రాజేశ్ కల్రా, ప్రఖ్యాత క్రీడా వ్యాఖ్యాత చారు శర్మలకు కేంద్ర క్రీడాశాఖ చోటు కల్పించింది.
ఇవీ ప్రధాన విభాగాలు...