తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్​లో భారత హాకీ జట్ల ప్రత్యర్థులు ఎవరంటే? - India women

వచ్చే ఏడాది జులై 24న ఆరంభమయ్యే ఒలింపిక్స్‌కు సంబంధించిన హాకీ షెడ్యూల్‌ శుక్రవారం విడుదలైంది. భారత పురుషుల జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. మహిళల జట్టు నెదర్లాండ్స్​తో పోటీపడనుంది.

hockey
న్యూజిలండ్​​, నెదర్లాండ్స్​తో భారత హాకీ జట్ల​ పోరు షురూ

By

Published : Jul 18, 2020, 9:15 AM IST

టోక్యో వేదికగా 2021లో జరగనున్న ఒలింపిక్స్​ హాకీ పోటీల షెడ్యూల్​ ఖరారైంది. జులై 24న ఆరంభమయ్యే క్రీడల పండగ ఆరంభమ్యాచ్​లో.. భారత పురుషుల జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. పూల్‌-ఎలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, స్పెయిన్‌, జపాన్‌, న్యూజిలాండ్‌తో కలిసి మన్‌ప్రీత్‌సింగ్‌ బృందం ఆడనుంది. భారత్‌.. జులై 25న ఆస్ట్రేలియాతో, జులై 27న స్పెయిన్‌తో, జులై 29న ఒలింపిక్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాతో, 30న జపాన్‌తో తలపడనుంది.

ఆగస్టు 1, 3, 5న వరుసగా పురుషుల క్వార్టర్స్​, సెమీస్​, ఫైనల్​ మ్యాచ్​లు జరగనున్నాయి.

మహిళలు ఇలా..

మరోవైపు పూల్‌-ఎలో ఉన్న భారత మహిళల జట్టు నెదర్లాండ్‌తో మ్యాచ్‌తో పోరును ప్రారంభించనుంది. ఈ పూల్‌లో జర్మనీ, గ్రేట్‌ బ్రిటన్‌, ఐర్లాండ్‌, దక్షిణాఫ్రికా ఉండగా, పూల్‌-బిలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్‌, స్పెయిన్‌, చైనా, జపాన్‌ ఆడనున్నాయి. నెదర్లాండ్స్‌తో ఆరంభ మ్యాచ్‌ తర్వాత జర్మనీ (జులై 26), గ్రేట్‌ బ్రిటన్‌ (జులై 28), అర్జెంటీనా (జులై 29), జపాన్‌ (జులై 30)తో రాణీ రాంపాల్‌ సేన తలపడనుంది.

ఒలింపిక్స్ హాకీ​ షెడ్యూల్​

ABOUT THE AUTHOR

...view details