భారత మాజీ హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్.. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్(ఓసీఏ) స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. మార్చి2, 3 తేదీల్లో బ్యాంకాంక్‌లో జరిగిన ఓసీఏ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకుంది ఒలింపిక్ కౌన్సిల్. 10 మంది సభ్యులుండే ఈ ప్యానల్లో సర్దార్ నాలుగేళ్ల పాటు(2019-2023) కొనసాగనున్నారు.
ఓసీఏ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా సర్దార్ సింగ్ - HOCKEY
భారత జట్టు మాజీ హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఆయన నామినేట్ అయ్యారు. నాలుగేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు.
సర్దార్ సింగ్
"ఓసీఏ నిబంధనలను అనుసరించి స్టాండింగ్ కమిటీ సభ్యులను నామినేట్ చేశా. వారందరికి నా అభినందనలు. రాబోయే నాలుగేళ్లలో మీ సహకారంతో మరింత ముందుకెళ్తాం" -- షేక్ అహ్మద్ అల్ ఫహాద్ అల్ సబాహ్, ఓసీఏ అధ్యక్షుడు