దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియాన్ని రూర్కెలాలో నిర్మించనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం మరోసారి చెప్పారు. గతంలో ప్రకటించిన విధంగానే 2023 పురుషులు హాకీ ప్రపంచకప్ సమయానికి ఈ స్టేడియాన్ని సిద్ధం చేయాలని సంకల్పించినట్లు తెలిపారు.
బిజూ పట్నాయక్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఆవరణలోని 15 ఎకరాల్లో, 20 వేలమంది ప్రేక్షకుల సామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నట్లు నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. హాకీ ప్రపంచకప్‌ను భువనేశ్వర్, రూర్కెలాలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒడిశా నుంచి దిలీప్ టిర్కీ, సునీతా లక్రా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.