మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియం పేరు మారుస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దివంగత హాకీ ఆటగాడు బల్బీర్ సింగ్ సీనియర్ తొలి వర్దంతి సందర్భంగా ఆయన పేరును స్టేడియానికి పెట్టారు.
మొహాలీ స్టేడియానికి దిగ్గజ హాకీ ఆటగాడి పేరు - బల్బీర్ సింగ్ సీనియర్
మొహాలీ అంతర్జాతీయ స్టేడియాన్ని ఇకపై దిగ్గజ హాకీ క్రీడాకారుడు బల్బీర్ సింగ్ సీనియర్ పేరుతో పిలవాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన ప్రథమ వర్దంతి సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆ రాష్ట్ర క్రీడల మంత్రి గుర్మిత్ సింగ్ పేర్కొన్నారు.
బల్బీర్ సింగ్, దిగ్గజ హాకీ క్రీడాకారుడు
"దిగ్గజ హాకీ క్రీడాకారుడు, పద్మ శ్రీ బల్బీర్ సింగ్ సీనియర్ ప్రథమ వర్దంతి సందర్భంగా.. మొహాలీ స్టేడియాన్ని ఆయనకు అంకితమిస్తున్నాం. ఇప్పటి నుంచి ఈ స్టేడియం పేరు బల్బీర్ సింగ్ సీనియర్ అంతర్జాతీయ హాకీ స్టేడియంగా మారుతుంది" అని పంజాబ్ క్రీడల మంత్రి రానా గుర్మిత్ సింగ్ సోధి తెలిపారు.
ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్: బోరున ఏడ్చిన క్రికెటర్