తెలంగాణ

telangana

ETV Bharat / sports

మూడో మ్యాచ్​ డ్రా.. ఆధిక్యంలో భారత్​ - మలేసియా-భారత్​

ఐదు మ్యాచ్​ల హాకీ సిరీస్​లో మలేసియాతో జరిగిన మూడో మ్యాచ్​ను డ్రాగా ముగించింది భారత్​. సోమవారం జరిగిన పోరులో హోరాహోరీగా తలపడ్డాయి ఇరు జట్లు. మొదట తడబడిన భారత మహిళా హాకీ జట్టు చివరికి 4-4తో మ్యాచ్​ డ్రా చేసుకుంది.

మలేసియా-భారత్​ మూడో మ్యాచ్​ డ్రా..ఆధిక్యంలో భారత్​

By

Published : Apr 9, 2019, 3:16 PM IST

మలేసియా వేదికగా జరుగుతున్న 5 మ్యాచ్​ల హాకీ సిరీస్​లో భాగంగా మూడో మ్యాచ్​నుభారత్ 'డ్రా'గా ముగించింది​. భారత్‌ తరఫున నవ్‌నీత్‌ 2 గోల్స్‌, నవ్‌జ్యోత్‌ కౌర్‌ , లాల్‌రెమ్‌సియామి చెరో గోల్‌ సాధించారు. మలేసియా తరఫున నురైనీ రషీద్‌ 2 గోల్స్‌ చేయగా, కిరణ్‌దీప్‌, నురామిరా ఒక్కో గోల్‌ చేశారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్​ సిరీస్‌లో 2–0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్​తోనే తొలిసారి గోల్స్​ ఖాతా తెరచింది మలేసియా.

మలేషియాతో మ్యాచ్​ డ్రా చేసుకున్న భారత్​

ABOUT THE AUTHOR

...view details