తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత మాజీ ఫుట్​బాలర్ బీర్ బహుదూర్ మృతి - బహుదూర్ తాజా వార్తలు

భారత మాజీ ఫుట్​బాల్ ఆటగాడు బీర్ బహుదూర్, శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల తెలంగాణ ఫుట్​బాల్ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

భారత మాజీ ఫుట్​బాలర్ బీర్ బహుదూర్ మృతి
మాజీ ఫుట్​బాలర్ బీర్ బహుదూర్

By

Published : May 31, 2020, 8:01 AM IST

హైదరాబాద్‌కు చెందిన మాజీ అంతర్జాతీయ ఫుట్‌బాలర్ బీర్‌ బహదూర్‌ (75) మరణించారు. కొన్ని రోజులుగా కోమాలో ఉన్న ఆయన.. శనివారం కన్నుమూశారు. బొల్లారంకు చెందిన బహదూర్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

భారత మాజీ ఫుట్​బాలర్ బీర్ బహుదూర్

1966 ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన బహదూర్‌కు అటాకింగ్‌ ఫార్వర్డ్‌గా పేరుంది. ఈఎంఈ సెంటర్‌ తరఫున 1960-70 మధ్య ఆయన సంతోష్‌ ట్రోఫీ లాంటి పలు జాతీయ టోర్నీల్లో పాల్గొన్నారు. ఆర్థికంగా ఇబ్బందిపడ్డ బహదూర్‌.. పానీపురి బండితో జీవనాన్ని కొనసాగించారు. బీర్‌ బహదూర్‌ మృతి పట్ల తెలంగాణ ఫుట్‌బాల్‌ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details