ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను ఇక నుంచి రెండేళ్లకోసారి నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అంశంపై సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఎస్ఏఎఫ్ఎఫ్) వార్షిక కాంగ్రెస్‌లో ఈ ప్రతిపాదన గురించి చర్చించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై ఓ క్రీడా ఛానల్ నివేదికను వెలువరించింది. తదుపరి పురుషుల ప్రపంచకప్ ఖతార్ వేదికగా 2022లో జరగనుండగా.. మహిళల వరల్డ్‌కప్ 2023లో ఆస్ట్రేలియా/న్యూజిలాండ్‌లో జరపనున్నారు.
"ఫుట్‌బాల్ భవిష్యత్ క్లిష్ట దశలో ఉందని చెప్పొచ్చు. ఈ విశ్వక్రీడను వేధిస్తున్న సమస్యలకు కొవిడ్ మహమ్మారి తోడైంది. ఇకపై నాలుగేళ్లకోసారి జరగాల్సిన ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను రెండేళ్లకోసారి జరపాల్సిన విషయాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు వాణిజ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది" అని ఎస్ఏఎఫ్ఎఫ్ అధ్యక్షుడు యాసీర్ అల్ మిషెల్ తెలిపారు.