తెలంగాణ

telangana

ETV Bharat / sports

వైరల్​: జకోకు ఎలా ఎగరాలో నేర్పిస్తున్న రొనాల్డో - క్రిస్టియానో రొనాల్డో

సెర్పియా టెన్నిస్ స్టార్ జకోవిచ్​కు జిమ్​లో ట్రైనింగ్ ఇచ్చాడు స్టార్ ఫుట్​బాలర్ రొనాల్డో. ఎలా ఎగరాలో అతడికి నేర్పిస్తున్నాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

Cristiano Ronaldo teaches Novak Djokovic 'how to jump' like him in training video
వైరల్​: జకోకు ఎలా ఎగరాలో నేర్పిస్తున్న రొనాల్డో

By

Published : Dec 27, 2019, 7:45 PM IST

పోర్చుగల్ ఫుట్​బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో.. ఇటీవలే జరిగిన ఓ మ్యాచ్​లో 8 అడుగులకు పైగా ఎత్తు ఎగిరి అద్భుతమైన హెడ్​గోల్ కొట్టాడు. ​తాజాగా ఈ ఫుట్​బాలర్.. సెర్బియా టెన్నిస్ స్టార్ జకోవిచ్​కు ఎగరడమెలాగో నేర్పిస్తున్నాడు.

శుక్రవారం ఒకే జిమ్​లో కలిసిన వీరిద్దరూ, కలిసి కసరత్తులు చేశారు. ఈ సందర్భంగా జకోకు ఎగరడమేలాగో శిక్షణనిచ్చాడు రొనాల్డో. ఈ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేశాడీ ఫుట్​బాలర్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

"నొవాక్ జకోవిచ్​కు జంప్ ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నా. నీతో కలిసి ట్రైనింగ్.. భాగ్యంగా భావిస్తున్నా మై ఫ్రెండ్" - క్రిస్టియానో రొనాల్డో

ఇటీవలే సంప్రోడియా - జ్యూవెంటస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో తలతో అద్భుతమైన గోల్ కొట్టాడు రొనాల్డో. దాదాపు 8.39 అడుగుల ఎత్తుకు ఎగిరి గోల్ చేశాడు.

ఇదీ చదవండి: భవిష్యత్తులో పంత్ మరింత పుంజుకుంటాడు: ఎమ్మెస్కే

ABOUT THE AUTHOR

...view details